HYD: ఇక మీదట గ్రేటర్ హైదరాబాద్ రోడ్ల మీది చెత్త వేస్తే చలాన్ల మోత మోగనుంది. రోడ్లపై చెత్త, భవన నిర్మాణ వ్యర్థాలు వేయకుండా GHMC కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. చెత్త వేస్తే భారీగా చలాన్లు వేసేలా ‘కాంప్రహెన్సీ చలాన్ మానిటరింగ్ సిస్టం’ పేరుతో కొత్త యాప్ను తీసుకువచ్చింది. మొదటిసారి వేస్తే రూ. 25,000, రెండోసారికి రూ. 50,000, మూడోసారికి రూ. లక్ష ఫైన్ వేయనుంది.