SRPT: నీరా కేఫ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్‌కు అప్పగించాలని తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన గీత కార్మికుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గీతకార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.