SRPT: తిరుమలగిరిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహించిన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే సామేలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల వారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.