MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోయారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.