AP: నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రజల వద్దకు వెళ్లి పలకరించి సమస్యలపై ఆరా తీయాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఎవరికీ అహంకారం వద్దు అని, అహంకారంతో గత పాలకులు 151 నుంచి 11కు పడిపోయారని చెప్పారు. దేశంలో ఏ పార్టీకీ లేనంతగా TDPకి కోటి మంది కార్యకర్తలు ఉన్నట్లు తెలిపారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.150 కోట్లను ఖర్చు చేసిన ఏకైక పార్టీ TDP అని పేర్కొన్నారు.