AP: దేశం మెచ్చేలా, ప్రపంచం ఆసక్తిగా చూసేలా అమరావతిని నిర్మిస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ఇందులో అనుమానమే లేదని.. అమరావతి అంటే దేవతల రాజధాని కాబట్టే, ఈ నగరం కొందరికి ఇష్టంలేదని విమర్శించారు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా అమరావతి అజేయం, శాశ్వతం అని స్పష్టంచేశారు. సీమకు కష్టాలు తీర్చి.. డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తున్నామన్నారు.