NGKL: సలేశ్వరం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ఏప్రిల్ 1వ నుంచి 3వ తేదీ వరకు నాగర్ కర్నూల్ డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య ఈరోజు తెలిపారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా వర్తిస్తుందన్నారు.