VKB: వనపర్తి పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై జరిగిన అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘాతుకాన్ని స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వసీం తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్య మానవత్వానికే మచ్చ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై తక్షణమే పోక్సో చట్టం కింద కఠినంగా శిక్షిచాలన్నారు.