ADB: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. MLA బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రజలు అనారోగ్య బారిన పడకుండా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ITDA పీఓ యువరాజ్, తదితరులు పాల్గొన్నారు.
NGKL: బిజినపల్లి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతిని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాలికల కోసం బాటలు వేసిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి ఫూలే అని తెలిపారు. ఆడపిల్లలు చదువుకుంటేనే సమాజం సంపూర్ణంగా బాగుపడుతుందని భావించి విద్యను అందించడంలో ఎనలేని కృషి చేసిన ధైర్యశాలి అని తెలిపారు.
BHPL: మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో సుమారు 70 వేల జనాభా ఉండగా, చెత్త కుండీలు నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి. చాలా కుండీలు పగిలి, ధ్వంసమై నిరుపయోగంగా మారాయి. సిబ్బంది వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చెత్త సేకరిస్తుండటంతో ప్రజలు చెత్తను ఇంట్లో నిల్వ చేయలేక ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన పడేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
KNR: హుజురాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పర్యటన నేపథ్యంలో జమ్మికుంట పోలీసులు దళిత బంధు సాధన సమితి సభ్యులను ముందస్తుగా అరెస్టు చేశారు. రెండో విడత దళిత బంధు నిధులు మంజూరు చేయాలని నిరసన తెలిపే అవకాశం ఉందని ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దళిత బంధు నిధులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం సరికాదని సమితి సభ్యులు మండిపడ్డారు.
WNP: ఇటీవల కాలంలో వనపర్తి జిల్లా ఆర్టీసీ డిపో నందు మెకానికల్ ఫోర్స్ మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన జయకృష్ణ మంగళవారం ఆయన వనపర్తి ఆర్టీసీ బస్సులను తనిఖీ చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో బస్సులను పరిశుభ్రతంగా పాటించాలని సూచించారు. చిన్న చిన్న రిపేర్లు ఉన్న బస్సులను ఆయన ప్రత్యేక దృష్టి సారించి వాటిని సరి చేయడం జరిగిందని తెలిపారు.
MDK: తూప్రాన్ పట్టణ పరిధి పోతరాజు పల్లి 33 బై 11 విద్యుత్తు సబ్ స్టేషన్‌లో మంగళవారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలను దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
BDK: జూలూరుపాడు మండలం గాంధీనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మంగీలాల్ ఇవాళ పంచాయతీకి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిలు తల్లిదండ్రులకు భారం కాకూడదని ఈ పథకాన్ని ప్రభుత్వం చేపడుతుందని సర్పంచ్ మంగీలాల్ తెలిపారు. చెక్కు అందజేసిన సర్పంచ్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
NLG: తెలంగాణ చేనేత కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు, అధ్యక్షులు శాంతి కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి చేనేత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రూ. 16.27 లక్షల రుణమాఫీ నిధులు విడుదలయ్యాయని, అర్హులందరికీ వర్తిస్తాయని మంత్రి తెలిపారు. బ్యాంకు రికార్డుల్లో లేని రుణమాఫీ ఫైళ్లను పరిష్కరించాలని కోరారు.
BHPL: అంత్య పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
KMR: పట్టణంలోనీ దేవునిపల్లీ PHCని DMHO రవీందర్ గౌడ్ ఇవాళ సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రణాళికలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
KMM: DCC ఖమ్మం మెడికల్ అండ్ హెల్త్ ఛైర్మన్‌గా నియమితులైన డాక్టర్ కాపా మురళీకృష్ణని మంగళవారం వైరా MLA మాలోత్ రాందాస్ నాయక్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
VKB: తాగునీటి అవసరాల కోసం నిర్మించిన వాటర్ ట్యాంకు లీకేజీల కారణంగా అధికారులు తొలగిస్తున్నారు. కుల్కచర్ల గ్రామ ప్రజలకు సుమారుగా 46 ఏళ్ళుగా తాగునీటిని సరఫరా చేస్తున్న ప్యాంట గడ్డ కాలనీలోని వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో (నూతన ట్యాంక్ నిర్మాణం కోసం) కూల్చడం పనులను ప్రారంభించారు. త్వరలో నూతన ట్యాంక్ నిర్మాణ చేస్తామన్నారు.
KNR: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.
NRML: ఇంటర్మీడియట్ పరీక్షలలో భాగంగా మంగళవారం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ పరశురాం తెలిపారు. మొత్తం 6206మంది విద్యార్థులకు గాను 6018 మంది పరీక్ష రాశారని, 188 మంది గైర్హాజరయ్యారని వారు పేర్కొన్నారు. కడెం మామడ, వశిష్ట జూనియర్ కళాశాలలో తనిఖీ చేసినట్లు DIEO తెలిపారు.