SRCL: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమాన్ని పశువుల యజమానులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరమా అగర్వాల్ అన్నారు. చందుర్తి మండలం మర్రి గడ్డ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి ఉచిత టీకాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.