ADB: ఉట్నూర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రేపు ఉమ్మడి ADB జిల్లా స్థాయి KU యూత్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు సంబధించిన NSS యూనిట్ విద్యార్థులు పాల్గొంటారని, మొత్తం 12 రకాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.