MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు ప్రజాతీర్పును ప్రభుత్వం గౌరవించి సహకరించాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కోరారు. కేసు విచారణలో భాగంగా చెన్నూర్ కోర్టుకు హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి కుట్రలు చేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.