• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కారు ప్రమాదం.. వ్యక్తి మృతి

SRPT: అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామ శివారులో జాతీయ రహదారి 365పై, సోమవారం రాత్రి కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి గాయాలు కాగా, స్థానికులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 10, 2026 / 06:36 AM IST

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

JGL: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 12న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. ZIPK ఇండియా జగిత్యాల సంస్థలో 20, అపోలో ఫార్మసీలో 100 ఖాళీల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు, హైదరాబాద్‌లో పనిచేయాలని తెలిపారు.

March 10, 2026 / 06:35 AM IST

MLA పాయల్ శంకర్ సమక్షంలో బీజేపీలో చేరికలు..

ADB: బేల మండలానికి చెందిన సర్పంచ్ తోడసం భీమ్ రావు, పలువురు నాయకులు MLA పాయల్ శంకర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో నిన్న రాత్రి చేరారు. వారికి MLA పాయల్ శంకర్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.

March 10, 2026 / 06:33 AM IST

వేం నరేందర్ రెడ్డిని కలిసిన తొర్రూరు కాంగ్రెస్ నేతలు

MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని తొర్రూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామ సహాయం కిషోర్ రెడ్డి, పీఎసీఎస్ ఛైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అధికంగా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేయాలని కోరారు.

March 10, 2026 / 06:33 AM IST

‘డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలి’

ASF: నిరుపేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. కాగజ్ నగర్ మండలం బారిగాంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను ఆమె పరిశీలించారు. మంజూరైన 480 ఇండ్లలో 192 ఇండ్లు బేస్మెంట్ దశలో ఉండగా వాటి వివరాలు తెలుసుకున్నారు. మిగిలిన 288 ఇండ్లను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు.

March 10, 2026 / 06:32 AM IST

నేడు ఎక్సైజ్ శాఖలో వాహనాల వేలం పాట

MULG: ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ములుగు పరిధిలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు అధికారులు తెలిపారు. వేలంలో పాల్గొనేవారు అప్సెట్ ధరలో 50% చెల్లించి, వాహనం పొందిన రోజు మిగతా మొత్తం చెల్లించి తీసుకెళ్ళాల్సి ఉంటుందని సూచించారు. స్క్రాప్ వాహనాలను కట్ చేసి మాత్రమే తీసుకెళ్ళాలని, జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు.

March 10, 2026 / 06:32 AM IST

‘100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతంగా చేయాలి’

SRPT: కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులపై ఎమ్మెల్యే పద్మావతి సమీక్ష సమావేశం నిర్వహించారు. పనుల్లో జాప్యం లేకుండా, నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

March 10, 2026 / 06:32 AM IST

6 గ్యారంటీలకు చట్టబద్రత కల్పించాలని ప్రైవేటు బిల్లు

SRCL: రానున్న శాసనసభ సమావేశాల్లో 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ, ‘ప్రైవేట్ మెంబర్ బిల్లు’ ప్రవేశపెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కత్తి వాళ్లకు ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎలా చేస్తామని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య పాల్గొన్నారు.

March 10, 2026 / 06:32 AM IST

‘మండల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి’

WNP: పెబ్బేరు మండల నూతన ఎంఆర్వోగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ రెడ్డిని సోమవారం స్థానిక బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు.

March 10, 2026 / 06:30 AM IST

‘పార్టీ బలోపేతం కోసమే నూతన మండల కమిటీల ఏర్పాటు’

వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో శ్రీరంగాపురం, పెబ్బేరు మండలలలో నూతన మండల కమిటీలను నియమించామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. భారత దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

March 10, 2026 / 06:29 AM IST

తాండూర్ ఎస్సైగా ప్రసాద్ బాధ్యతలు స్వీకరణ

MNCL: తాండూర్ ఎస్సై ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై కిరణ్ కుమార్ బదిలీ కాగా, ఆయన స్థానంలో నెన్నెల ఎస్సై  విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌ను, తాండూర్‌కు బదిలీ చేశారు. మండలంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలను పర్యవేక్షణకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

March 10, 2026 / 06:19 AM IST

ఇళ్లు లేకుండానే ఇంటి నంబర్లు.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు

WGL: పర్వతగిరి మండలం దౌలత్ నగర్‌లో ఇళ్లు నిర్మించకుండానే ఇంటి నంబర్లు కేటాయించడంపై కలెక్టరేట్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు కొన్ని నంబర్లు భూమిపై ఇళ్లు లేకుండా ఇచ్చారు అని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నంబర్లపై పన్నులు వసూలు చేయకూడదని పంచాయతీ తీర్మానించింది. అక్రమ కేటాయింపులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

March 10, 2026 / 06:18 AM IST

నేడు కొయ్యూరులో మెగా హెల్త్ క్యాంప్

భద్రాద్రి: చర్ల మండలంలోని కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్ హారిక తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ ఆప్తాల్మాలజిస్ట్ ఆర్థోపెడిక్, డెంటల్ స్పెషలిస్టులు అందుబాటులో ఉండి రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.

March 10, 2026 / 06:14 AM IST

‘షాపుల కేటాయింపులో వర్గీకరణ అమలు చేయాలి’

NGKL: కల్వకుర్తిలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ షాపుల కేటాయింపులో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్య దర్శి మబ్బు సాయన్న మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం అదనపు కలెక్టర్ అమరేందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. షాపులను స్థానికులకే కేటాయించాలని, వర్గీకరణ ద్వారా మాదిగలకు న్యాయం చేయాలని కోరారు.

March 10, 2026 / 06:12 AM IST

HYDలో ఆత్మహత్యల వెనక కారణాలు ఇవే.!

HYD: నగరంలో నమోదవుతున్న ఆత్మహత్య కేసులను విశ్లేషించిన పోలీసులు, ప్రధాన కారణాలను తెలిపారు. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, మద్యం, జూదానికి బానిస కావడం, భార్యా భర్తల మధ్య వేధింపులు, నిరుద్యోగం, ప్రేమ విఫలం కావడం, అనారోగ్య సమస్యలు వంటి కారణాల వల్ల చాలామంది తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

March 10, 2026 / 06:10 AM IST