JGL: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 12న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. ZIPK ఇండియా జగిత్యాల సంస్థలో 20, అపోలో ఫార్మసీలో 100 ఖాళీల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు, హైదరాబాద్లో పనిచేయాలని తెలిపారు.