MNCL: తాండూర్ ఎస్సై ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. రెండు నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై కిరణ్ కుమార్ బదిలీ కాగా, ఆయన స్థానంలో నెన్నెల ఎస్సై విధులు నిర్వహిస్తున్న ప్రసాద్‌ను, తాండూర్‌కు బదిలీ చేశారు. మండలంలో చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతలను పర్యవేక్షణకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.