• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఆసుపత్రిలో 24 గంటల సేవలు అందించాలి’

నారాయణపేట పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల ఎమర్జెన్సీ సేవలు అందుబాటులోకి తేవాలని అహ్మద్ యూసఫ్ తాజ్ కోరారు. సోమవారం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ఫణిందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొత్త ఆసుపత్రి దూరంగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. పాత ఆసుపత్రిలో ఓపీతో పాటు అత్యవసర సేవలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

March 9, 2026 / 08:50 PM IST

దళిత యువతకు ఉపాధి రుణాలు అందించాలి: యాదగిరి

SDPT: నంగునూరు మండలానికి చెందిన నిరుద్యోగ దళిత యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించాలని TPCC కార్యదర్శి దేవులపల్లి యాదగిరి కోరారు. సోమవారం హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో ఛైర్మన్ ప్రీతంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దళితుల నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని ఆరోపించారు.

March 9, 2026 / 08:50 PM IST

డిజిటల్ యుగంలో సైబర్ నేరాల పట్ల జాగ్రత్త: SI

GDWL: డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ఎంత అవసరమో, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తత అంతకంటే ముఖ్యం అని గట్టు SI శేఖర్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గట్టు ప్రభుత్వ ఆసుపత్రి, విద్యాసంస్థల్లో మహిళలకు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఆన్‌లైన్ ఫ్రెండ్‌షిప్ మోసాలు, సైబర్ స్టాకింగ్, ఫేక్ అకౌంట్ల వేధింపుల గురించి వివరించారు.

March 9, 2026 / 08:48 PM IST

‘విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలి’

SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. హత్నూరలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. బాలికలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే నేరుగా పోలీసులను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

March 9, 2026 / 08:47 PM IST

HPV వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దు: కలెక్టర్

ASF: రానున్న రోజుల్లో గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించేందుకు 9–14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు. వ్యాక్సిన్ పై ఎలాంటి అపోహలు వద్దని, 9–14 ఏళ్ల బాలికలు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

March 9, 2026 / 08:47 PM IST

రేపు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్

SDPT: సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల, శ్రీనగర్ కాలనీల పరిధిలోని 11 కేవీ ఫీడర్లో నిర్వహణ పనుల దృష్ట్యా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఏడీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మారుతి నగర్, నీలకంఠేశ్వర ఆలయం, సాయి నగర్, శ్రీనగర్, భారత్ నగర్, శివం టెంపుల్ ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు.

March 9, 2026 / 08:44 PM IST

‘ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి’

KNR: ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వైద్యాధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఉందని, గ్రామీణ స్థాయిలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

March 9, 2026 / 08:44 PM IST

బస్సు టైరు కిందపడి మహిళ మృతి

NLG: మిర్యాలగూడ బస్టాండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దేవరకొండ వెళ్లే బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు టైరు కిందపడి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలితో పాటు ఉన్న చిన్న బాబు కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 9, 2026 / 08:43 PM IST

మంచి మనసు చాటుకున్న ప్రతిమా ఫౌండేషన్ నిర్వాహకులు

MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలు సౌకర్యాలు కల్పించి ప్రతిమా ఫౌండేషన్, కరీంనగర్ నిర్వాహకులు మంచి మనసును చాటుకున్నారు. వాలా విజయ జగన్నాధ రావు జ్ఞాపకార్థం ప్రతిమ ఫౌండేషన్ కరీంనగర్ వారి సౌజన్యంతో బోయినపల్లి ఉషారాణి, బోయినపల్లి హరిణి, వాల అశోక్ రావు సోమవారం బాదంపల్లి జడ్పీ పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

March 9, 2026 / 08:43 PM IST

స్పోర్ట్స్ విలేజ్ కోసం కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో క్రీడల అభివృద్ధి కోసం ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్కూల్ / స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయను ఢిల్లీలో కలిసి సోమవారం వినతిపత్రం సమర్పించారు. పట్టణానికి ఆనుకుని సుమారు 300 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలన్నారు.

March 9, 2026 / 08:40 PM IST

‘బాలికలందరికీ HPV టీకా అందించాలి’

ఖమ్మం జిల్లాలోని 14-15 ఏళ్ల బాలికలందరికీ గర్భాశయ క్యాన్సర్ నివారణకు HPV టీకాను పూర్తిస్థాయిలో అందించాలని అదనపు కలెక్టర్ పీ. శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఆసుపత్రి, సీహెచ్సీలలో ఉదయం 9.00 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు ఈ టీకాలు అందుబాటులో ఉంటాయన్నారు.

March 9, 2026 / 08:40 PM IST

ధర్మపురి గోదావరి తీరాన్ని పరిశీలించిన కలెక్టర్

JGL: జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సోమవారం ధర్మపురి పట్టణంలో గోదావరి తీరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో పారిశుధ్య పరిస్థితులు, శుభ్రత పనులపై సమీక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు రాబోతున్నందున పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

March 9, 2026 / 08:38 PM IST

‘ఆత్మహత్యా యత్నం.. కాపాడిన పోలీసులు’

ADB: బోథ్ మండలంలోని దన్నూరు గ్రామానికి చెందిన నరసయ్య అనే యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ఆధారంగా బాధితుడిని సోమవారం కాపాడారు. తండ్రి ఇస్తారి మందలించాడని కుమారుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని వెల్లడించారు. క్షణికావేశంలో యువకులు తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని CI గురుస్వామి సూచించారు.

March 9, 2026 / 08:37 PM IST

నేడు నిజాంపల్లిలో ప్రత్యేక అవగాహన శిబిరం

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామపంచాయతీ వద్ద రేపు ఉదయం 10 గంటలకు పలు పథకాలపై ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు BPM నాగేశ్వరి తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా జిల్లా IPPB అధికారులు రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ శిబిరంలో పోస్ట్ ఆఫీస్ పథకాలు, ప్రమాద బీమాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 9, 2026 / 08:37 PM IST

రేపు నిజాంపల్లిలో ప్రత్యేక అవగాహన శిబిరం

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామపంచాయతీ వద్ద రేపు ఉదయం 10 గంటలకు పలు పథకాలపై ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు BPM నాగేశ్వరి తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా జిల్లా IPPB అధికారులు రానున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ శిబిరంలో పోస్ట్ ఆఫీస్ పథకాలు, ప్రమాద బీమాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 9, 2026 / 08:37 PM IST