• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇచ్చోడ తహశీల్దార్‌గా ఇమ్రాన్ నియామకం

ADB: ఇచ్చోడ మండలం నూతన తహశీల్దార్‌గా ఇమ్రాన్ నియామకమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు నూతన తహశీల్దార్ల నియామకం చేపట్టగా సోనాల మండలంలో పని చేస్తున్న ఇమ్రాన్‌ను ఇచ్చోడకు బదిలీ చేశారు. ఆయన సోమవారం ఇచ్చోడ తహశీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.

March 9, 2026 / 04:08 PM IST

SLBC ప్రాజెక్ట్ పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

NLG: SLBC ప్రాజెక్ట్ పూర్తి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్బంగా మాట్లాడారు. SLBC ప్రాజెక్ట్ ద్వారా దేవరకొండ ప్రాంతానికి 50 వేల ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలిపారు. నిర్విఘ్నంగా నియోజకవర్గం అభివృద్ధి కొనసాగుతుందని, ప్రతి సెంటు భూమికి సాగునీరు అందిస్తామన్నారు.

March 9, 2026 / 04:06 PM IST

జిల్లాలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ASF: జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. TDPS సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కౌటాల, కెరమెరి ప్రాంతాల్లో అత్యధికంగా 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 38.1,బెజ్జుర్ 37.9 డిగ్రీలు నమోదయ్యాయి. కాగజ్ నగర్ 36.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

March 9, 2026 / 04:06 PM IST

‘మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట’

SRCL: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ మండలంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురం మారుపాక చీర్లవంచ గుర్రవానిపల్లి, కోడుముంజ గ్రామాల్లో 50 లక్షలతో ఐదు మహిళా సమైక్య సంఘం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

March 9, 2026 / 04:06 PM IST

ఇంటర్ పరీక్షలకు 262 మంది గైర్హాజరు

WNP: జిల్లాలోని 25 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. 5,613 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై 213 మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. 1,311 మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 1,262 మంది విద్యార్థులు హాజరై 49 మంది గైర్హాజరైనట్టు చెప్పారు.

March 9, 2026 / 04:04 PM IST

జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. బీర్కూర్, కొల్లూరు 38.4°C, మేనూరు 38.1, సోమూరు, భిక్కనూరు 38, ఎల్పుగొండ 37.9, సర్వాపూర్ 37.6, డోంగ్లి 37.2, బీబీపేట 37.1, జుక్కల్, గాంధారి 36.9, పుల్కల్ 36.7, నాగిరెడ్డిపేట, బిచ్కుంద, మాచాపూర్ 36.6, సదాశివనగర్ 36.5, లచ్చపేట 36.4, పెద్దకొడప్గల్ 36.3°Cలుగా నమోదయ్యాయి.

March 9, 2026 / 04:01 PM IST

‘చెరువులు, కుంటలను పరిరక్షించండి’

MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలను పరిరక్షించాలని కోరుతూ గత ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించినా ఎవరు స్పందించలేదని తెలంగాణ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు కాడి ప్రభాకర్ ఆరోపించారు. ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ఫిర్యాదు చేశారు. వెంటనే తకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

March 9, 2026 / 04:01 PM IST

టెన్త్ ఫలితాల్లో కోదాడ నంబర్ 1 కావాలి: ఎమ్మెల్యే

SRPT: పదవ తరగతి ఫలితాల్లో కోదాడ నియోజకవర్గం జిల్లాలోనే ప్రధమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పిలుపునిచ్చినారు. సోమవారం కోదాడ బాలుర పాఠశాలలో కలెక్టర్ పంపిన పరీక్షా సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు భయం లేకుండా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.

March 9, 2026 / 04:01 PM IST

‘స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి’

MNCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు.

March 9, 2026 / 04:00 PM IST

‘అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలి’

ADB: ఇందిరమ్మ గృహ అర్హులను L2, L3 నుంచి L1 జాబితాలోకి మార్చి అర్హులకు లబ్ధి చేకూర్చాలని టీపీసీసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ అన్నారు. సంబంధిత సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. RDO స్రవంతిని సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. L2, L3 ఉండటం వలన నిరుపేదలైన వారికి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఆర్డీవో సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

March 9, 2026 / 03:53 PM IST

నూతన రాజ్యసభ సభ్యుడిని కలిసిన మంత్రి

NRPT: రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన గౌరవనీయులు శ్రీ వేం నరేందర్ రెడ్డిని సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన అపార అనుభవంతో దేశాభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా మంత్రి కోరారు.

March 9, 2026 / 03:52 PM IST

నిధులు కేటాయించాలని మంత్రికు వినతి.!

RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబ్‌పేట మండలంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ.. ఐటీ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పామేన భీమ్ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విన్నపంపై సానుకూలంగా స్పందించిన మంత్రి, వెంటనే తదుపరి చర్యలు తీసుకోవడానికి కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

March 9, 2026 / 03:52 PM IST

ఆడపిల్లలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లు.!

వికారాబాద్ జిల్లాలో 9 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల ఆడపిల్లలకు భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ(HPV) వ్యాక్సిన్‌ను వేయనున్నట్లు జిల్లా వైద్యాధికారి స్వర్ణకుమారి తెలిపారు. జిల్లాలో 14 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల ఆడపిల్లలు 10,610 మంది ఉన్నట్లు ఆమె వెల్లడించారు. పరిగి, తాండూర్, కొడంగల్ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని తెలిపారు.

March 9, 2026 / 03:47 PM IST

PHCనీ తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాందాస్

BDK: వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ’99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జూలూరుపాడు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేసి, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలు, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

March 9, 2026 / 03:46 PM IST

‘పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి’

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ CPM పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 10 వార్డు CPM పార్టీ కౌన్సిలర్ శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వరుసగా గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. పీఎం నరేంద్ర మోదీ స్పందించి గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.

March 9, 2026 / 03:45 PM IST