BDK: టేకులపల్లి మండలం రోళ్ళపాడు చెరువులో సుమారు 12 అడుగుల పొడవు కలిగిన భారీ కొండచిలువ మృత్యువాత పడింది. మత్స్యకారులు వేసిన వలలో రాత్రి సమయంలో చిక్కుకున్న ఈ కొండచిలువ బయటకు రాలేక విలవిలలాడి ప్రాణాలు విడిచింది. సుమారు 50 కిలోల బరువున్న ఈ భారీ పామును చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
JN: దేవరుప్పుల గ్రామపంచాయతీ వద్ద వాటర్ ప్లాంట్‌ను సుందర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ సుందర్ పునః ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీ అందించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నామని, ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
NRML: కుబీర్ గ్రామ పంచాయతీ ఈవోగా మాధవ్ నియమితులయ్యారు. బదిలీపై వచ్చిన ఆయన ఇవాళ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి కనీస వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పాలనను ప్రజలకు మరింత దగ్గర చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
KMM: కాంగ్రెస్ పార్టీ తరుపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేమ్ నరేందర్ రెడ్డి సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రజల అభివృద్ధి కోసం మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు.
SRCL: తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 91 మంది విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను బీఆర్ఎస్ నాయకులు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు పిల్లలు పంపిణీ చేశామన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు.
RR: స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో పద్మశాలి కుల వివరాల నమోదులో ఉన్న తప్పులను సరిదిద్దాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మంత్రి నివాసంలో సంఘం నాయకులు కలిశారు. ఈ సాంకేతిక లోపాల వల్ల భవిష్యత్తులో విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రాలు పొందేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను ఏలే వెంకట నారాయణ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
VKB: కరెంట్ షాక్‌తో మహిళా మృతి చెందిన ఘటన యాలాల మండలం రాస్నంలో జరిగింది. గ్రామానికి చెందిన మక్త శశికళ (36) అనే మహిళ ఇంట్లో నీళ్లు పడుతుండగా వైర్ తాకడంతో కరెంట్ షాక్ తగిలి మరణించింది. ఇంట్లో ఎర్త్ లేకపోవడం, గోడలకు నీటి చెమ్మ పట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. శశికళకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. చిన్నారులు తల్లిని కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది.
MDCL: నగర పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని అల్వాల్ డీసీ భోగేశ్వర్లు కోరారు. సోమవారం అల్వాల్‌లో ఆయన మీడియాకు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అల్వాల్ సర్కిల్‌లో ఎక్కడైనా చెత్త లేదా వ్యర్థాలు పేరుకుపోయి శుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నట్లయితే, సంబంధిత ప్రదేశం ఫొటోతో పాటు గూగుల్ లోకేషన్‌ను పంపిస్తే, మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకుని చెత్తను తొలగిస్తారన్నారు.
KMM: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య, సాక్షి దంపతులకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ అయ్యప్పస్వామి ఆలయ దేవాలయ 12వ వార్షికోత్సవం ఈనెల 13, 14న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు MLA బీర్ల ఐలయ్య కు సోమవారం ఆలయ కమిటీ అధ్యక్షులు సుడుగు శ్రీనివాస్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బింగు పాండురంగం, కార్యదర్శి లు కూరపాటి విష్ణు, సార కర్ణాకర్, కూరపాటి విష్ణు పెద్దగాని శ్రీను ఉన్నారు.
JGL: ధర్మపురిలో జరిగిన రాష్ట్రస్థాయి కుంగు ఫూ కరాటే ఛాంపియన్ పోటీలలో జగిత్యాలకు చెందిన కుజ్జఫు రాధ వెంకటేశ్వర్లు బ్లాక్ బెల్ట్ ఉత్తమ రిఫరీ అవార్డు సోమవారం అందుకున్నారు. అవార్డు గ్రహీత వెంకటేశ్వర్లు పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి కావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. గ్రాండ్ మాస్టర్ రాజమల్లు, ప్రవీణ్ పాల్గొన్నారు.
BHPL: ప్రతి ఒక్కరం సమన్వయంతో పని చేస్తూ భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ కౌన్సిల్ హాలులో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. భూపాలపల్లిని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
KNR: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కరీంనగర్‌లో ఆదివారం 2కే రన్ నిర్వహించారు. కళాభారతి నుంచి డా. బీఆర్. అంబేద్కర్ స్టేడియం వరకు జరిగిన ఈ రన్‌లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.
NGKL: కల్వకుర్తి మునిసిపాలిటీ వడ్డెర బస్తీ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని స్థానిక కౌన్సిలర్ శ్రీరాములు అన్నారు. ప్రభుత్వ పాఠశాలను ఆయన సోమవారం సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, పాఠశాల ఛైర్మన్ రమాదేవి, అంగన్వాడి టీచర్ జయమ్మ ఆయనను సన్మానించారు.
NLG: మిట్ట వేసవిలో శాలిగౌరారం ప్రాజెక్టుకు నీరు తీసుకురావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చామల యాదగిరి రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన తనయుడు చామల వెంకటరమణ రెడ్డి సాగునీటి సరఫరాకు విశేష కృషి చేస్తున్నారని రైతులు కొనియాడారు. రబీ, ఖరీఫ్ పంటలకు నీరు అందేలా చొరవ చూపినందుకు కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.