• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపు హనుమాన్ స్వాముల మండల భిక్ష

KMR: నస్రుల్లాబాద్ మండలం మైలారంలో మంగళవారం హనుమాన్ స్వాముల మండల భిక్షను ఏర్పాటు చేయనున్నట్లు హనుమాన్ స్వామి దూలి రాము తెలిపారు. ఈ కార్యక్రమానికి మల్లారం కృష్ణ మహారాజ్ స్వామిజీ హాజరు కానున్నట్లు‌‌ ఆయన తెలిపారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

March 9, 2026 / 11:29 AM IST

పదవ తరగతి పరీక్షలు విద్యార్థి జీవితంలో అత్యంత కీలకం

BDK: అశ్వారావుపేట మండలం మామిళ్లవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో అతి ముఖ్యమైనవని భయపడకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటించాలని తెలిపారు.

March 9, 2026 / 11:28 AM IST

విద్యార్థులను తనిఖీ చేసిన జిల్లా ఇంటర్ విద్యాధికారి

WNP: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సెల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ సామగ్రిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్షా కేంద్రం వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు.

March 9, 2026 / 11:25 AM IST

టూ కే రన్ ప్రారంభించిన కార్పొరేషన్ మేయర్

BDK: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎం. గణేష్ ఆధ్వర్యంలో సోమవారం టూ కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు నిర్వహించినట్లు తెలిపారు.

March 9, 2026 / 11:23 AM IST

జలాల్‌పూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NZB: బాల్కొండ మండలం జలాల్‌పూర్ రంగనాథస్వామి ఆలయ సమీపంలో రూ. 5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సురేశ్ రెడ్డి సహకారంతో ఈ నిధులు మంజూరయ్యాయి. గ్రామాభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే, ఎంపీలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

March 9, 2026 / 11:20 AM IST

అయిజలో 5కే రన్ నిర్వహణ

GDWL: అయిజ పట్టణంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యక్రమం సందర్భంగా 5కే రన్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సైదులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఛైర్మన్ సీఎం సురేశ్, వైస్ ఛైర్మన్ నరసింహులు ప్రారంభించారు. పట్టణంలోని ప్రజలు, యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

March 9, 2026 / 11:18 AM IST

‘పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత’

ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం 5కే రన్ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుంచి ప్రారంభమైన రన్ రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ షాహీన్ సుల్తానా, కమిషనర్ బట్టు తిరుపతి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.

March 9, 2026 / 11:17 AM IST

రాయపట్నంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

KMM: మధిర మండలం రాయపట్నంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ కంచం గోపి ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది డ్రైనేజీలు శుభ్రం చేసి త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేయడం లక్ష్యమని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 9, 2026 / 11:16 AM IST

రేపే లాస్ట్ డేట్

JGL: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి తోపాటు 7వ, 8వ, 9వ, 10వ తరగతులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి గడువు రేపటితో ముగియనుంది. 6వ తరగతిలో మొత్తం సీట్ల భర్తీకి మిగిలిన తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుల గడువు గత నెల 28కే ముగియగా ప్రభుత్వం 10 రోజుల పాటు గడువు పొడిగించింది. గడువు రేపటితో ముగియనుంది.

March 9, 2026 / 11:15 AM IST

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి సీజ్

హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హనోయ్ నుంచి కౌలాలంపూర్ మీదుగా వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ ఏషియా AK069 విమానంలో వచ్చిన వారి నుంచి 9.10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 3.18 కోట్లు ఉంటుందని అంచానా వేశారు. నిందితులను అరెస్ట్ చేయగా విచారణ కొనసాగుతోంది.

March 9, 2026 / 11:11 AM IST

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గంజాయి సీజ్.!

హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హనోయ్ నుంచి కౌలాలంపూర్ మీదుగా వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ ఏషియా AK069 విమానంలో వచ్చిన వారి నుంచి 9.10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 3.18 కోట్లు ఉంటుందని అంచానా వేశారు. నిందితులను అరెస్ట్ చేయగా విచారణ కొనసాగుతోంది.

March 9, 2026 / 11:11 AM IST

మహిళా భవనానికి భూమి పూజ

MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో మహిళా భవన నిర్మాణానికి సర్పంచ్ గడప బోయిన భాగ్యలక్ష్మి యాదగిరి ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. పాలకవర్గం పాల మంజుల, ముస్కురి ఆంజనేయులు, చేరుపల్లి సంతోష్, కుంట మహేష్, కర్రె నాగేష్, మస్కూరి పోచయ్య పాల్గొన్నారు.

March 9, 2026 / 11:09 AM IST

రైతు వేదిక నిర్మాణంలో నాణ్యతకు తూట్లు

NZB: ఎడపల్లి మండల కేంద్రంలో రూ. 22 లక్షల వ్యయంతో 2022లో నిర్మించారు. ఈ రైతు వేదిక నిర్మాణం పనుల్లో కాంట్రాక్టర్ కక్కుర్తి పడి, నాణ్యతగా పనులు చేపట్టక పోవడంతో, ప్రస్తుతం ఈ భవనం ఒకవైపు నిరుపయోగంగా పడి ఉండగా, మరొకవైపు భవనం చుట్టూ వేసిన గోడలు కుంగిపోయాయి, మరికొన్నిచోట్ల గోడలు కూలిపోయాయి.

March 9, 2026 / 11:06 AM IST

ఈనెల 12వ తేదీ నుంచి టీ-హబ్‌లో లీడర్‌షిప్ కాన్ఫరెన్స్

HYD: ఈనెల 12వ తేదీ నుంచి HYD టీ-హబ్‌లో లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంస్థల్లో నాయకత్వ మార్పులు, బృందాల పనితీరుపై విశ్లేషణ వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. గ్లోబల్ డైరెక్టర్ పికెట్ ముఖ్య ప్రసంగం చేయనున్నారు. మరోవైపుగా.. పరిశ్రమలకు ఉపయోగపడే కీలక ఆలోచనలు ఈ కాన్ఫరెన్స్‌లో వెలువడనున్నాయని పేర్కొన్నారు.

March 9, 2026 / 11:05 AM IST

5కె రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయం నుంచి పట్టణ ముఖ్యకూడలి వరకు 5K రన్ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. షాద్‌నగర్ మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్ పాల్గొన్నారు.

March 9, 2026 / 11:05 AM IST