ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం 5కే రన్ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుంచి ప్రారంభమైన రన్ రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ షాహీన్ సుల్తానా, కమిషనర్ బట్టు తిరుపతి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.