NZB: బాల్కొండ మండలం జలాల్పూర్ రంగనాథస్వామి ఆలయ సమీపంలో రూ. 5 లక్షల ఎంపీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను సర్పంచ్ గుండేటి మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ సురేశ్ రెడ్డి సహకారంతో ఈ నిధులు మంజూరయ్యాయి. గ్రామాభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే, ఎంపీలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.