GDWL: ఎస్సీ అభ్యర్థుల స్వయం ఉపాధి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటోలు, సోలార్ యూనిట్లపై సబ్సిడీ అందిస్తున్నట్లు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. అర్హులు ఏప్రిల్ 8లోగా సంబంధిత వెబ్సైట్లో https://tgobmmsnew.cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలని సూచించారు.