KRNL: వెల్దుర్తి మండలం సూదేపల్లి పొలిమేరలో రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్సై నరేశ్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.