SKLM: అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ మేరకు మొత్తం రూ.88,70,216 ఆదాయం లభించినట్లు ఆలయం ఈవో ప్రసాదరావు తెలిపారు. అదే విధంగా భక్తుల నుంచి 20 గ్రాముల బంగారం, కేజీ 700 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయన్నారు. ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు.