TG: రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో దారుణం చోటుచేసుకుంది. పులిగోనీపల్లి తండాలో బాణావత్ రామ్‌దాస్ నాయక్ మద్యం మత్తులో భార్య, పిల్లలను చావబాదాడు. ఈ ఘటనలో భార్య, కుమారుడు మృతిచెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ జానకి రెడ్డి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.