టాలీవుడ్ నటుడు సుహాస్ హీరోగా దర్శకుడు గోపి అచ్చెర తెరకెక్కించిన ‘హే బల్వంత్’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT సంస్థ జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక తన తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా తీసుకోవాలనుకునే యువకుడి కథతో ఈ సినిమా తెరకెక్కింది.