గుంటూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయని ప్రస్తుత అధ్యక్షుడు వై.శివసూర్యనారాయణ తెలిపారు. 2,018 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గెలిచిన కార్యవర్గం ఏడాదిపాటు కొనసాగుతుంది. బార్ అసోసియేషన్ కార్యాలయంలో నాలుగు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 4.30 గంటలకు ముగుస్తుందన్నారు.