సత్యసాయి: మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర స్ఫూర్తితో ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా ‘లోకేష్ యువదళం’ సంస్థ ఏర్పాటైంది. పచ్చా అశోక్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ ఆర్గనైజేషన్ బ్రోచర్‌ను మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ యువదళం బృందానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.