• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘సైబర్ నేరాలు.. ఊరు వదిలి వెళ్తున్నారు’

NLG: జిల్లాలో ఇటీవల కొంతమందిపై సైబర్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో భయంతో సైబర్ నేరగాళ్లు గ్రామాలు వదిలి వెళుతున్నట్లు సమాచారం. HYDతో పాటు పలు ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఉంటున్నట్లు తెలుస్తోంది. పోలీసులు వారిని పట్టుకునే పనిలో ఉన్నారు. సైబర్ నేరాలతో జీవితం నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

March 9, 2026 / 11:05 AM IST

చికిత్స పొందుతున్న పారిశుద్ధ్య కార్మికురాలికి పరామర్శ

నల్గొండలో పారిశుద్ధ్య కార్మికురాలు బిపంగి అన్నపూర్ణ కారు ప్రమాదానికి గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా నేతలు పరామర్శించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎండి సలీం, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, యూనియన్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ పట్టణ కార్యదర్శి కృష్ణ పరామర్శించారు.

March 9, 2026 / 11:05 AM IST

KPHB భూగర్భ జలాల రిపోర్ట్ ఎక్కడ..?

MDCL: బాలానగర్, కూకట్‌పల్లి, కైతలాపూర్, KPHB ప్రాంతాల్లో భూగర్భ జలాల రిపోర్టు ఫిబ్రవరి మొదటివారం వరకు మాత్రమే అందుబాటులో ఉందని, ఆ తర్వాత ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాల్సిన అధికారులు అప్‌డేట్ చేయలేదని భూగర్భ జల ఇంజనీర్లు పలువురు తెలిపారు. ప్రస్తుత వేసవి వేల ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, వాటర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

March 9, 2026 / 11:05 AM IST

ఖమ్మం క్రికెట్‌లో పంచాయతీరాజ్ ఘన విజయం

ఖమ్మం జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించిన సంత్ సేవాలాల్ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో పంచాయతీరాజ్ జట్టు ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌పై ఘనవిజయం సాధించింది. విజేతలకు జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, కూరపాటి ప్రదీప్ బహుమతులు అందజేశారు.

March 9, 2026 / 11:02 AM IST

‘డ్రైనేజీ క్లీన్ చేసి మురుగునీరు తొలగించండి’

VKB: డ్రైనేజీ పొంగిపొర్లుతూ దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వికారాబాద్ పట్టణంలోని ఆర్టీసీ డిపో మండల మెయిన్ రోడ్డుపై అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నీరు పొంగిపొర్లి రోడ్డుపై మురుగునీరు చేరి దుర్వాసనతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

March 9, 2026 / 11:02 AM IST

ఆ గ్రామంలో ‘NO’ పన్ను.. తీర్మానించిన గ్రామస్థులు

WGL: పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామ పంచాయతీ ఇంటి పన్నులు వసూలు చేయకూడదని తీర్మానం చేసింది. గ్రామ రికార్డుల్లో కొన్నిస్థలాలకు ఇంటి నంబర్లు ఉన్నప్పటికీ, భౌతికంగా అక్కడ ఇళ్లు లేకపోవడంతో వాటికి సంబంధించిన పన్నులు వసూలు చేయవద్దని నిర్ణయించారు. ఇల్లు లేని స్థలాల్లో ఇంటి నంబర్లు ఎలా కేటాయించారంటూ.. ముక్కున వేలేసుకుంటున్నారు. 

March 9, 2026 / 11:02 AM IST

నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు

MNCL: చెన్నూరు పట్టణంలోని 9వ వార్డు మేదరివాడలో బోర్‌వెల్‌కు సోమవారం నూతన మోటార్ ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వార్డులో కాలనీవాసులకు నీటి ఎద్దడి ఏర్పడకుండా పాడైపోయిన మోటార్ స్థానంలో నూతన మోటార్ ఏర్పాటు చేసి ముందస్తు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వార్డు కౌన్సిలర్ పేర్కొన్నారు. నూతన మోటారు అందజేసిన మంత్రి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

March 9, 2026 / 11:02 AM IST

ప్రారంభమైన తోట్ల ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవం

VKB: మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లి శ్రీ తోట్ల ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్త మాజీ కౌన్సిలర్ జగ్గరి రత్నారెడ్డి నేతృత్వంలో ఈ వార్షికోత్సవ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఎర్నేపల్లిలోని భక్తులు, వికారాబాద్‌లోని భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

March 9, 2026 / 11:01 AM IST

మండలంగా ఏర్పాటు చేయాలని వినతి..

HNK: హనుమకొండలో ఇవాళ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డిని మామునూరు మండల సాధన సమితి నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. మామునూరును మండల కేంద్రంగా ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఛైర్మన్‌0ను వారు కోరారు. త్యాగాలకు మారుపేరైన మామునూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ తెలిపారు.

March 9, 2026 / 10:57 AM IST

ఎమ్మెల్యే కడియంతో ఎర్రబెల్లి స్వర్ణ భేటీ

JN: మహిళా సమస్యల పట్ల పోరాడాలని పార్టీలో, సమాజంలో మహిళల్లో చైతన్యం నింపే విధంగా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ ఇవాళ ఎమ్మెల్యే కడియంతో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయడంతో పాటు పార్టీలో మహిళలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు.

March 9, 2026 / 10:54 AM IST

నేడే చివరి తేదీ

కరీంనగర్ SRR ప్రభుత్వ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి నేడు సోమవారం చివరి తేదీ అని కోర్సు సమన్వయకర్త డా. బూర్ల చంద్రశేఖర్ తెలిపారు. అభ్యర్థులు SSC, INTER జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, 2 ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 9, 2026 / 10:41 AM IST

ప్రగతి ప్రణాళికపై అవగాహన ర్యాలీ

BDK: మణుగూరు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అద్దంకి నరేష్, సీఐ నాగబాబు, ఎంపీవో పల్నాటి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

March 9, 2026 / 10:40 AM IST

నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులు

SRPT: అనంతగిరి నుంచి చనుపల్లి వరకు రూ. 20 కోట్లతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గ్రామ శివారు ప్రాంతాల్లో పనులు పూర్తయిన మండల కేంద్రంలోని రెండు కిలోమీటర్ల మేర విస్తరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రహదారి విస్తరణ వల్ల ఇళ్లు కోల్పోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు.

March 9, 2026 / 10:39 AM IST

అక్రమ రైస్ మిల్లు నిర్మాణంపై ఫిర్యాదు

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామ శివారులోని గుండ్లకుంట ఎఫ్టిఎల్, బఫర్ జోన్‌లలో అక్రమంగా రైస్ మిల్లు నిర్మాణం చేస్తున్నారని గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కుమ్మరి నర్సింలు, చెట్లపల్లి చంద్రశేఖర్ తదితరులు తూప్రాన్ ఆర్డిఓ, తహసిల్దార్, ఎంపీడీవోలకు వేరువేరుగా ఫిర్యాదులు చేశారు. అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని ఈ సందర్భంగా కోరారు.

March 9, 2026 / 10:36 AM IST

నేటి సత్తి పత్తి, మిర్చి ధరలు ఇలా

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం వివిధ సరుకుల ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. క్వింటాల్ పత్తి ధర రూ.7330, క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.19500, క్వింటాల్ 341 (కారం కాయ) ధర రూ.21600, క్వింటాల్ వండర్ హట్ ధర రూ.35000, క్వింటాల్ ఎల్లో మిర్చి ధర రూ.21000, క్వింటాల్ దీపిక మిర్చి ధర రూ.31000, క్వింటాల్ 5531 మిర్చి ధర రూ.20000గా పలికింది.

March 9, 2026 / 10:35 AM IST