JGL: హైదరాబాద్‌లోని అవే మరియా స్కూల్, రామంతపూర్‌లో Japan Karate Association India Telangana ఆధ్వర్యంలో సీనియర్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ముంబైకు చెందిన చంద్రశేఖర్ శెట్టి విద్యార్థులకు ఉన్నత స్థాయి కరాటే శిక్షణ ఇచ్చారు. జగిత్యాల జిల్లా నుంచి 8 మంది శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ వివరించారు.
NLG: హాలియాలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సాయి ప్రశాంత్ తెలిపారు. హాలియాలో పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేయగా ఏడుగురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.53,600 నగదు, ఏడు మొబైల్ పోన్లు, మూడు మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు రోజురోజుకు మండిపోతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో 38.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సమావేశంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాల అభివృద్ధిపై చర్చించారు.
VKB: భానుడి ప్రతాపం అధికంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రధానంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు జిల్లా అంతా తిరుగుతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక బయటికి రాని పరిస్థితి ఉన్నప్పటికీ తప్పనిసరిగా బయటికి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఈ వారంలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
HNK: జిల్లాలో DLD, DPSE కోర్సుల్లో ప్రవేశాలకు డీఈఈసెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైనట్లు HNK డైట్ కళాశాల ప్రిన్సిపల్ బీ.రంగయ్య ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ నెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 21, 22 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
GDWL: కఠినమైన దారి అయినా మల్లన్న దర్శన భాగ్యం కోసం ఎంత దూరమైనా నడుస్తాం అని చాగదోణ గ్రామ శివభక్తులు ఉత్సాహంగా చాటారు. సోమవారం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రను ప్రారంభించారు. హర హర మహాదేవ శంభో శంకర నినాదాలతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
NGKL: కొండనాగుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులకు నేడు యూరియా అందుబాటులో ఉండనుంది. ఉదయం 10 గంటల నుంచి స్టాక్ పంపిణీ చేస్తామని సీఈవో గుజ్జ రాజవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతులు తమకు కావాల్సిన ఎరువులను ఫెర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. యాప్‌లో ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వారికే యూరియాను అందజేస్తామన్నారు.
HYD శివారులో భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసుల పనులను డెడ్ లైన్ వరకు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పనుల పురోగతిని వేగవంతం చేసి అవసరమైన అనుమతులు, ఇతర అవసరాలను వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలకు త్వరగా సేవలు అందేలా పనులను సమయానికి పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
KMM: సత్తుపల్లిలో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులతో 5K రన్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ రిహానా కమల పాషా కమిషనర్ నరసింహ ఈ పరుగును ప్రారంభించారు. వార్డ్ కౌన్సిలర్లు, అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
KNR: శంకరపట్నం మండలంలో ఈనెల 10 నుంచి ఏప్రిల్ 7వ తేది వరకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు, మండల పశువైద్యాధికారి డాక్టర్ మాధవరావు తెలిపారు. మండలంలోని 27 గ్రామాలలో 8వ విడత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు డాక్టర్ మాధవరావు తెలిపారు. ఈ సదవకాశాన్ని మండల పరిధిలోని పాడి రైతులు, గొర్రెల యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NGKL: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు ప్రత్యేక సదరం (SADAREM) శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గది నంబర్ 28లో ఈరోజు ఉదయం 10:00 నుంచి సదరన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని వివిధ మండలాలలోని ఉన్నటువంటి ప్రజలు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
BHPL: కాటారం మండల కేంద్రంలోని జగ్గయ్యపల్లె గ్రామ శివారులోని వాగులో ఇటీవల లభించిన 12వ శతాబ్దానికి చెందిన పురాతన శ్రీ జగన్మోహిని కేశవ స్వామి శిలా విగ్రహాన్ని గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో గ్రామంలోకి తరలించారు. ఈ చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు జరగనుందని గ్రామపెద్దలు, ఆలయ అర్చకులు తెలిపారు.
SRD: జిన్నారం మున్సిపాలిటీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం 5 కే రన్‌ను మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ప్రారంభించారు. ఈ రన్‌లో జిన్నారం గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు జీవన్, తేజ, రుత్విక్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించి నగదు పురస్కారాలు అందుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, కమిషనర్ తిరుపతి ఉన్నారు.
MLG: మంగపేట (M) నర్సింహాసాగర్‌లో కొన్ని రోజులుగా వీధిలైట్లు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీకట్లో బయటకు రావాలంటే పాములు, విషపురుగులు, దొంగల భయంతో భయాందోళనకు గురవుతున్నారు. పాములు రోడ్లపై తిరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే లైట్లు మరమ్మతు చేసి సరిచేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.