• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

టైటిల్ సాధించడం దేశం ప్రజలకు గర్వకారణం: MLA గండ్ర

BHPL: టీ20 వరల్డ్ కప్ 2026ను గెలిచిన భారత జట్టుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ సాధించడం దేశ ప్రజలకు గర్వకారణమని అన్నారు. సమిష్టి కృషి, పట్టుదలతో న్యూజిలాండ్‌ పై ఫైనల్‌లో అద్భుత ఆటతీరు చూపారని MLA ప్రశంసించారు.

March 9, 2026 / 09:07 AM IST

నగరంలో 5కే రన్

WGL: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశంతో సోమవారం 5కే రన్ నిర్వహించారు. GWMC ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని నగర మేయర్ గుండు సుధారాణి, WGL, HNK జిల్లా కలెక్టర్‌లు సత్య శారద, చాహత్ బాజ్ పాయ్ పాల్గొన్ని రన్‌ను ప్రారంభించారు. పోచమ్మ మైదాన్ జంక్షన్ నుంచి హన్మకొండ వెయ్యిస్థంభాల గుడి వరకు ఈ 5కే రన్ సాగింది.

March 9, 2026 / 09:05 AM IST

‘పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తాం’

PDPL: మంథని మండలంలో పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఎంఈవో దాసరి లక్ష్మి తెలిపారు. పరీక్షల నిర్వహణకు 2 సెంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మంథని పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో ఒక సెంటర్, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఒక సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి మొత్తం 442 మంది విద్యార్థులు ఉన్నారన్నారు.

March 9, 2026 / 09:03 AM IST

వైరాలో నేడు ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్

KMM: వైరా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇవాళ ఉదయం 11 గంటలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) రాకుండా అడ్డుకునేందుకు ఈ వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని వైరా పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ శ్రీ హర్ష తెలిపారు. 14 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేయనున్నట్లు ఆయన తెలిపారు.

March 9, 2026 / 09:02 AM IST

CM CUP-2.. అంకిత కు గోల్డ్ మెడల్

MBNR: మహబూబ్ నగర్‌లోని అంధుల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జి. అంకిత సీఎం కప్ టోర్నీలో గోల్డ్ మెడల్ సాధించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన సీఎం కప్- 2 దివ్యాంగుల పోటీలలో జి.అంకిత 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్, షాట్ పుట్లో సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో పాఠశాల హెచ్ఎం రాములు, పీడీ మధుసూదన్,జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు.

March 9, 2026 / 09:02 AM IST

త్వరలో SHO అధికారులుగా మహిళా పోలీసులు

HYD: మహిళా పోలీసులకు ఉన్నత అవకాశాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పోలీస్ స్టేషన్లలో మహిళలను SHO అధికారులుగా నియమించే ప్రక్రియను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. HYD, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లకు త్వరలో SHO అధికారులుగా మహిళా పోలీసులు నియమించబడనున్నట్లు సమాచారం.

March 9, 2026 / 09:02 AM IST

మహిళా పోలీసులకు ఘన సత్కారం

MBNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా పోలీసులను సీఐ అప్పయ్య ఆదివారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. పోలీసు శాఖలో మహిళా పోలీసులు నిబద్ధతతో పని చేస్తారన్నారు.

March 9, 2026 / 09:01 AM IST

ఊట్ల గ్రామంలో 5కే రన్ ప్రారంభించిన చైర్మన్

SRD: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిన్నారం మున్సిపాలిటీ ఊట్ల గ్రామంలో సోమవారం ఉదయం 7 గంటలకు నిర్వహించిన 5K రన్‌ను మున్సిపల్ చైర్మన్ జనార్దన్ ప్రారంభించారు. వార్డు కార్యాలయం నుంచి జిన్నారం మున్సిపల్ కార్యాలయం వరకు ఈ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

March 9, 2026 / 09:00 AM IST

వేములవాడ లాడ్జి హత్య కేసు ఛేదించిన పోలీసులు

SRCL: వేములవాడ పట్టణంలోని లాడ్జిలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం, బెదిరింపుల కారణంగా భూక్య మోహన్(30)ను హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. శారద, ఆమె భర్త శేఖర్, స్నేహితుడు రవిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేరానికి ఉపయోగించిన ద్విచక్రవాహనం, నైలాన్ తాడు, చాకును స్వాధీనం చేసుకున్నారు.

March 9, 2026 / 08:56 AM IST

‘పంటను బట్టి ఎరువుల మోతాదును వెయ్యాలి’

MNCL: రైతులు పొలాల్లో వేసిన పంటను బట్టి యూరియాను వేయాల్సి ఉంటుందని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలోని చాలా గ్రామాలలో రైతులు వేసిన పంటలు ఎదుగుదశలో ఉన్నాయన్నారు. ఆయా పంటలకు అవసరమైన ఎరువులను కూడా రైతులకు అధికారులు అందజేస్తున్నారని తెలిపారు. ఆ పంటలకు ఎరువులను వేసే ముందు వ్యవసాయ అధికారుల సలహాలను, సూచనలను పాటించాలన్నారు.

March 9, 2026 / 08:51 AM IST

భీమారంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం

JGL: భీమారం మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ చెక్కపల్లి స్వాతి ఆధ్వర్యంలో గ్రామస్తులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 9, 2026 / 08:47 AM IST

మల్కాజ్‌గిరి జిల్లా ఉపాధ్యాయులకు వేసవిలో ట్రైనింగ్

MDCL: జిల్లా పరిధిలో ఈ వేసవి కాలంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయుల నైపుణ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ శిక్షణ అందించనున్నారు. ఏ అంశాలపై శిక్షణ అవసరమో తెలుసుకునేందుకు సర్వే ఫారమ్‌ను అధికారిక కేంద్రాలకు పంపించారు. మార్చి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 9, 2026 / 08:47 AM IST

నిర్ణయాత్మక శక్తిగా మహిళ ఎదగాలి: కలెక్టర్

ASF: నిర్ణయాత్మక శక్తిగా మహిళలు ఎదిగినప్పుడే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ హరిత పునరుద్ఘాటించారు. ASF వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలసి హాజరయ్యారు. మహిళ సాధికారిత సాధ్యం కావాలంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలన్నారు.

March 9, 2026 / 08:45 AM IST

ప్రశ్నించినందుకు కాంక్రీట్‌తో దాడి

SRPT: నడిగూడెం మండలంలోని కరివిరాలలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనం పనులు నాసిరకంగా చేస్తున్నారని గ్రామానికి చెందిన డీవైఎఫ్ఐ నాయకుడు భద్రయ్య ఆదివారం పనులను అడ్డుకున్నాడు. అనంతరం సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. అధికారులెవరూ రాకపోగా పనులు అడ్డుకున్న తనపైనే కొందరు సిమెంట్ కాంక్రీటు పోశారని భద్రయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.

March 9, 2026 / 08:44 AM IST

డాక్టర్ల అధ్యయనం.. ఊబకాయం వెనక కారణం ఇదే!

HYDలో 91 మందితో పాటు ఇండియా, యూకే దేశాల్లోని దాదాపు 7,000 మంది పై నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు బయటపడ్డాయి. జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం లోపం, హార్మోన్ల అసమతుల్యత వల్ల ఉబకాయం పెరుగుతోందని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఓబీసీటీ కారణంగా భవిష్యత్‌లో డయాబెటిస్, గుండె జబ్బులు, లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.

March 9, 2026 / 08:42 AM IST