KMM: వైరా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇవాళ ఉదయం 11 గంటలకు హెచ్పీవీ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) రాకుండా అడ్డుకునేందుకు ఈ వ్యాక్సిన్ ఎంతో దోహదపడుతుందని వైరా పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ శ్రీ హర్ష తెలిపారు. 14 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న ఆడపిల్లలందరికీ ఈ వ్యాక్సిన్ ఉచితంగా వేయనున్నట్లు ఆయన తెలిపారు.