• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి: CPM

ADB: కేంద్రంలోని BJP ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యుని నడ్డి విరుస్తుందని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం ఇజ్రాయిల్ అమెరికాకు మద్దతు తెలపడం వల్లే ఇరాన్ చమురు సరఫరాను నిలిపివేయడంతో ఈ దాపురించిందని తెలిపారు.

March 8, 2026 / 09:24 PM IST

కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో మహిళా దినోత్సవ వేడుకలు

కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో జిల్లా స్థాయి మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ.. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, అలాగే, సంస్థలో మహిళా ఉద్యోగుల సేవలు చాలా గొప్పవని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ స్థాయిలోని మహిళా ఉద్యోగులను సత్కరించారు. ఆర్టీసీ డిప్యూటీ RMలు భూపతి రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.

March 8, 2026 / 09:07 PM IST

అధికారుల సమన్వయంతోనే ‘పల్లె ప్రగతి’ విజయం

KMR: ప్రజా పాలన – పల్లె ప్రగతి 99 రోజుల కార్యాచరణను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఎల్‌పీఓ శ్రీనివాస్ సూచించారు. నేడు స్థానిక GP కార్యాలయంలో సర్పంచ్ సాద్విక సాయినాథ్ అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల ప్రణాళికపై పలు సూచనలు చేశారు.

March 8, 2026 / 09:00 PM IST

సెలవు రోజుల్లో పాఠశాల బయటే కేజీబీవీ విద్యార్థినులు

WNP: రేవల్లి మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు సెలవు దినాల్లో తమ యోగక్షేమాలు తెలుసుకొని చూసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు పాఠశాల బయట వెళ్లి కలవాల్సిన పరిస్థితి నెలకొంది. గత రెండువేల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఈ పాఠశాలను దాదాపు 5.6 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కలుసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.

March 8, 2026 / 09:00 PM IST

అల్విన్ కాలనీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

RR: అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండలో మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో MLA గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని, కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించి ఆర్థిక స్వాలంబన సాధించాలని, పురుషులతో సమానంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన తెలిపారు.

March 8, 2026 / 08:59 PM IST

‘రంజాన్ మాసం ఐక్యతకు ప్రతీక’

MHBD: రంజాన్ సందర్భంగా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని మస్జిద్-ఏ-రేహ్మానియాలో ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస విరమణ చేయించారు. రంజాన్ మాసం ఐక్యతకు ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, ముస్లిం పెద్దలు ఉన్నారు.

March 8, 2026 / 08:59 PM IST

సైనిక్ స్కూల్ ఎంట్రన్స్‌లో సాన్వీ రికార్డ్.. ఎమ్మెల్యే సన్మానం

NLG: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE)-2026లో జాతీయ స్థాయిలో 1393 ర్యాంక్ సాధించిన సందుపట్ల సాన్వీ సాగర్‌ను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా మ్యాథ్స్‌లో సాన్వీ 150/150 మార్కులు సాధించడం విశేషం. గొడుకొండ్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ భవాని తదితరులు అభినందించారు.

March 8, 2026 / 08:55 PM IST

సైబర్ నేరాల పట్ల ప్రజలకు జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ

ఆదిలాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్న నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఈ వారం జిల్లా సైబర్ కార్యాలయానికి 8 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. సైబర్ నేరానికి గురైన వెంటనే ప్రజలు 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

March 8, 2026 / 08:55 PM IST

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NZB: రుద్రూర్ మండలం రాయకూర్ 33/11 కేవీ సబ్ స్షేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రాయకూర్, సిద్ధాపూర్, రాణంపల్లి, సులేమాన్ నగర్, లింగంపల్లి, చిక్కడపల్లి గ్రామాల్లో కరెంటు ఉండదని పేర్కొన్నారు.

March 8, 2026 / 08:55 PM IST

ఈనెల 10న యాదాద్రి హుండీ లెక్కింపు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి భక్తుల కానుక రూపంలో సమర్పించిన హుండీ ఆదాయాన్ని ఈనెల 10న లెక్కించనున్నట్లు ఆదివారం ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. కొండ కింద శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో ఉదయం ఏడు గంటలకు ఆలయ సిబ్బంది, వాలంటీర్లచే, భద్రత సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

March 8, 2026 / 08:51 PM IST

నూతన భవనం ప్రారంభించిన కేంద్రమంత్రి

కరీంనగర్ పట్టణంలోని జ్ఞాన భారతి అఖిలభారత విద్యార్థి పరిషత్ నూతన భవనంను కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ కార్పొరేటర్లు, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

March 8, 2026 / 08:49 PM IST

‘కేసీఆర్ హయాంలో ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట’

NZB: బాల్కొండ మండల కేంద్రంలో ఆదివారం ముస్లీమ్ మైనారిటీ సోదరులతో కలిసి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన – సంక్షేమ స్వర్ణయుగం గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నిజమైన లౌకికవాదంతో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు.

March 8, 2026 / 08:47 PM IST

కోదాడలో ఘనంగా ఇఫ్తార్ విందు

SRPT: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని కౌన్సిలర్ నరేశ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన, అనంతరం ఉపవాస దీక్షలను విరమింపజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

March 8, 2026 / 08:47 PM IST

చైన్ స్నాచర్‌ను వెంటాడి పట్టుకున్న పోలీసులు

KMR: పట్టణంలోని స్టేషన్ రోడ్డులో డీసీబీ బ్యాంక్ ఎదుట ఆదివారం ఓ మహిళ మెడలోని బంగారు తాడును లాక్కొని పారిపోతున్న వ్యక్తిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. ఈ ఘటనను గమనించి వెంటనే నిందితుడిని వెంబడించారు. కొద్దిదూరం తరుముకుని అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, బంగారు చైన్‌తో సహా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 8, 2026 / 08:44 PM IST

‘ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరం’

KNR: రాష్ట్రంలో ప్రతిభతో క్రీడల్లో రాణించే పరిస్థితి లేకపోవడం బాధాకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఖేల్ మహోత్సవంలో మాట్లాడుతూ.. అందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిదర్శనమన్నారు. హెచ్ సీఏలో సెలెక్ట్ కావాలంటే పైరవీలు, డబ్బులు తీసుకుని సెలెక్ట్ చేసే సంస్కృతిని కొందరు తీసుకొచ్చారన్నారు.

March 8, 2026 / 08:44 PM IST