NLG: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE)-2026లో జాతీయ స్థాయిలో 1393 ర్యాంక్ సాధించిన సందుపట్ల సాన్వీ సాగర్‌ను ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఘనంగా సన్మానించారు. ముఖ్యంగా మ్యాథ్స్‌లో సాన్వీ 150/150 మార్కులు సాధించడం విశేషం. గొడుకొండ్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ భవాని తదితరులు అభినందించారు.