SRPT: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని కౌన్సిలర్ నరేశ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన, అనంతరం ఉపవాస దీక్షలను విరమింపజేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.