HNK: జిల్లాకు చెందిన జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి తన స్వీయ అనుభవాలతో ‘నీ రుణం తీరేది ఎట్ల’ అనే పుస్తకాన్ని రచించారు. ఈనెల 10వ తేదీన హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు రచ్చ రవి తెలిపారు. ముఖ్య అతిథిగా నటుడు, ఆధ్యాత్మికవేత్త తనికెళ్ల భరణిని ఆహ్వానించారు. ఆదివారం పుస్తక నమూనా ప్రతిని రచ్చ రవి, భరణికి బహూకరించారు.
NLG: కొండమల్లేపల్లిలో ఫిబ్రవరి 8న జరిగిన రూ. 33 లక్షల విలువైన గోద్రేజ్ కెమికల్ లారీ దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు లారీ డ్రైవర్ ప్రకాష్ రాజేంద్ర సకరేను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు.తన ఆరుగురు స్నేహితులతో కలిసి ప్రణాళికాబద్ధంగా ఈ చోరీకి పాల్పడినట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ పాల్గొన్నారు.
KMM: ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల బదిలీలకు ఎట్టకేలకు లైన్ క్లియరైంది. సుమారు 200 మంది సిబ్బందికి స్థానచలనం కలగనుండగా, ఈ నెల 18న అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. సిబ్బంది తమ ఆప్షన్లను ఈ నెల 13 నుంచి 16 వరకు సమర్పించుకోవడానికి అవకాశం కల్పించారు.
MLG: ఆహార ఉత్పత్తిలో మహిళలది ప్రధాన పాత్ర అని మంత్రి సీతక్క అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిర్వహించిన మెగా రైతు మేళాకు మంత్రి హాజరయ్యారు. 60-80% మంది మహిళలు వ్యవసాయంలో పనిచేస్తున్నారని, మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో మహిళలకు భాగస్వామ్యం కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తుందన్నారు.
KMM: హైదరాబాద్‌లో ‘ప్రాపర్టీ పల్స్’ అనే దేశంలోనే మొట్టమొదటి రియల్ ఎస్టేట్ వారపత్రికను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాల వల్ల తెలంగాణలో రియల్ రంగం పుంజుకుంటోందని, ఫ్యూచర్ సిటీ, మెట్రో రెండో దశ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు వేదికగా మారిందని తెలిపారు.
BHPL: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మహాముత్తారం BJP మండల అధ్యక్షుడు పూర్ణచందర్ విమర్శించారు. ఇవాళ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కేవలం రెండు సార్లు మాత్రమే రైతు భరోసా విడుదల చేసినట్లు తెలిపారు. వెంటనే రైతు బంధును విడుదల చేయాలన్నారు.
WGL: నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను శాలువలతో సన్మానించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. మహిళలు పోలీస్ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు చట్టం, శాంతి భద్రతల పరిరక్షణలో ముందుండి విధులు నిర్వహించడం గర్వకారణం అని అన్నారు.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తాళ్లాళ్లపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఎంపీడీవో శశికళ, సర్పంచులు మీసాల కనకరాజు, ఖాతా మల్లేశం పాల్గొన్నారు.
NRML: జిల్లా కేంద్రానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది పరిసర ప్రాంతంలో ఆదిమానవులు ఉపయోగించిన మెగాలిథిక్ మైక్రోలిథ్స్ టూల్స్ పరిశ్రమ ఆనవాళ్లు నేడు వెలుగుచూశాయని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావు తెలిపారు. రాతి పరుపులపై కనిపించే గ్రూవ్స్ ద్వారా రాతి గొడ్డళ్ళు, బాణాల అంచులు, వేటకు ఉపయోగించే ఆయుధాలను తయారు చేసుకున్నట్లు వారు తెలిపారు.
MHBD: కేసముద్రం మండల కేంద్రంలోని జ్యోతిబాపూలే సెంటర్ వద్ద CPM పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా CPM జిల్లా కమిటీ సభ్యులు పాపారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు రూ.60 పెంచడం ద్వారా నిరుపేదల పై భారం మోపుతోందని అన్నారు. ధరలు వెంటనే తగ్గించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ADB: ఈనెల 10న ADB ఏఆర్ హెడ్ క్వార్టర్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. వివిధ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ముఖ్యంగా ఆదివాసి నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించేలా ఆదివాసి పెద్దలు కృషి చేయాలని కోరారు.
JGL: ఈనెల 14 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షల కోసం కథలాపూర్ మండలంలో 4 పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు ఎంఈవో శ్రీనివాస్ శనివారం తెలిపారు. మండలంలోని 13 పాఠశాలల్లో 511 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. కథలాపూర్ మోడల్ స్కూల్, జడ్పీ హైస్కూల్, గంభీర్పూర్ జడ్పీ హైస్కూల్, అంబర్పేట జడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
వరంగల్ నగరంలోని చక్రజ్‌కుంట ప్రాంతంలో కుందూరు వెంకటరెడ్డి ఇంట్లో పేకాట జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,700 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు.
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక మూడు వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తమ కౌన్సిలర్లు ఓకే తాటిపై ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నిర్ణయించుకున్న ప్రకారం ఛైర్మన్‌గా బీఆర్ఎస్, వైస్ ఛైర్మన్‌గా సీపీఐ ఉంటుందని పేర్కొన్నారు.
SRPT: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మోతే పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుళ్లు విజయ, రేఖలను ఏఎస్సై శ్రీరాములు ఆధ్వర్యంలో ఈరోజు శాలవతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శాంతిభద్రతల పరిరక్షణలో మహిళ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు.