MBNR: జడ్చర్లలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. లిఫ్ట్ అడిగిన ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మహిళపై ఇద్దరు యువకులు వరుసగా అత్యాచారం చేశారు. మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తించారు. వారి నుంచి తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
BDK: కరకగూడెం పీహెచ్‌సీలో ఇవాళ తెలంగాణ రైసింగ్ నెంబర్ వన్ కార్యక్రమంలో భాగంగా మిషన్ హెల్త్ 100 డేస్ స్పెషలిస్ట్ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారని వైద్యాధికారి డా. పి.రవితేజ తెలిపారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు గైనకాలజీ, పీడియాట్రిక్స్, కంటి, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, డెంటల్ విభాగాల వైద్యులు సేవలు అందిస్తారని వెల్లడించారు.
SGR: జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు చెందిన నూతన ఛైర్మన్లు, కౌన్సిలర్లకు ఈ నెల 12న శిక్షణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ చట్టం–2019పై ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. శిక్షణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
NRPT: రాష్ట్రంలోని మూడు క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి వెంకటేశ్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డితో కలిసి ప్రవేశాల వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించి, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని వెల్లడించారు.
JGL: కోరుట్ల రూరల్ సెక్షన్ పరిధిలోని 33 కేవీ వల్లంపల్లి, కోనరావుపేట ఫీడర్లలో చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని AE బి. శ్రీనివాస్ తెలిపారు. సంగెం, నాగులపేట, కోనరావుపేట, పెద్దాపూర్, రామారావుపల్లి గ్రామాల వినియోగదారులు సహకరించాలని కోరారు.
NZB: మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి, TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ రెడ్డి పాల్గొన్నారు.
RR: విద్యార్థులు మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావలని రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ సభ్యులు కళ్యాణ్ పంగులూరు అన్నారు. చేవెళ్ల మండలం ఊరెళ్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కంప్యూటర్లు, ప్రొజెక్టర్, ఫర్నిచర్, ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ DEOగా లలిత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్ హరితను మర్యాపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. జిల్లా విద్యా అభివృద్ధి, పాఠశాలల పరిపాలన, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు కోసం కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రభుత్వ విద్యా విధానాలను సమర్థంగా అమలు చేస్తూ అందరి సహకారంతో విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.
MDK: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కలెక్టరేట్లోని వివిధ శాఖల సెక్షన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫైల్ క్లియరెన్స్ వేగవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో స్వచ్ఛత, పరిశుభ్రత పనులను తనిఖీ చేసి నిరుపయోగ వస్తువులు, పరికరాలను తొలగించాలని ఆదేశించారు.
JN: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని పాలకుర్తి కాంగ్రెస్ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా సేవలు అందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
MHBD: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా తొర్రూరు మండలంలోని గుర్తూరు గ్రామంలో ఇంకుడు గుంత నిర్మాణానికి స్థానిక సర్పంచ్ విసంపల్లి కవిత బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. గ్రామంలో మురుగునీటి సమస్య పరిష్కారం కేవలం ఇంకుడు గుంతతోనే సాధ్యమవుతుందని, ప్రతి ఇంటింటికి ఇంకుడు గుంత ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో 250 ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు రేపు ఉదయం 10:30 గంటలకు జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్సైజ్, పిల్లలమర్రి రోడ్ మహబూబ్‌నగర్‌లో ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ తెలిపారు. టెన్త్, ఆపై చదివిన 18 – 30 ఏళ్ల యువత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డుతో హాజరుకావాలని అన్నారు.
JGL: కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం రాయికల్ మండలం ఇటిక్యాల ZPHS పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు విధానం, వంట గదిని పరిశీలించారు. పదవ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
VKB: తాండూరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని ఎమ్మెల్యే బి.మనోహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, పూర్తయిన ఇళ్లకు గృహప్రవేశ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని మహానంద టాకీస్ వెనకాల ఇటికల చెరువు పర్సనల్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని లక్షెట్టిపేట పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం చెరువు పర్సనల్‌లో గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉన్నాడని వారు పేర్కొన్నారు. మృతదేహాన్ని గుర్తించిన వారు వెంటనే సెల్ నెంబర్ 6301754814లో వెంటనే సంప్రదించాలని వారు కోరారు.