ADB: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఏఐ మార్ఫింగ్, యూపీఐ, లోన్, ఉద్యోగాల పేరుతో సాగే మోసాల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. ఈ వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని వెల్లడించారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
ASF: కాగజ్‌నగర్ పట్టణం గాంధీ పార్క్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా MLC దండే విఠల్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించి సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని అన్నారు. మహిళా సాధికారత కేవలం ఆర్థికాభివృద్ధి తోనే కాకుండా, సామాజిక చైతన్యంతో కూడా సాధ్యమవుతుందన్నారు.
BDK: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శనివారం ఐడీవోసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మతో కలిసి వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 99 రోజులపాటు చేపట్టనున్న కార్యాచరణపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
SRCL: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసి పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ వన్నెల రమణారెడ్డి చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో బోయినిపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన జుట్టు రేఖ-తిరుపతి కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో శనివారం జరిగింది.
KNR: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని, ఉద్యోగాలు, వ్యాపారాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించాలని, తద్వారా సమాజంలో గుర్తింపు పొందాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
NLG: ఏపీకి చెందిన కృష్ణ యూనియన్ ‘విజయ తెలంగాణ’ పేరుతో కల్తీ పాలు, నెయ్యి విక్రయిస్తోందని రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గుత్త అమిత్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇవ్వడంతో మార్కెట్లోకి కల్తీ ఉత్పత్తులు వస్తున్నాయని, ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ ఉన్నట్లు NDDB రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు.
NZB: డిచ్‌పల్లి మండలంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఐ వినోద్, ఎస్సై ఆరీఫ్ పాల్గొన్నారు. శనివారం సాయంత్రం ఇస్లాంపురంలోని మజీద్‌లో సదర్ హమీద్, వసీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ హాజరై ముస్లిం సోదరులతో దీక్ష విరమణ చేయించారు. హిందూ ముస్లింలు అందరూ కలిసి మెలిసి పండగలు చేసుకోవాలని సీఐ సూచించారు.
MNCL: భీమారం- జైపూర్ మండల కేంద్రాల మధ్య శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు మందమర్రి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముదిరాజులకు సముచిత స్థానం ఏర్పడిందని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మెట్టుకడి ప్రభాకర్ అన్నారు. ముదిరాజ్ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ మొదటి మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్‌ను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్న ముదిరాజుల గతంలో పట్టించుకోలేదన్నారు.
WNP: నియోజకవర్గ పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువలు, చెక్ డ్యామ్‌ల లాంటి అనేక వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని శనివారం వనపర్తి జిల్లా నీటిపారుదుల శాఖ అధికారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. నల్ల చెరువు నుంచి అమ్మ చెరువు వరకు వెళ్లే కాలువల బలోపేతం పై ప్రత్యేక దృష్టి ఉంచాలని తెలిపారు.
PDPL: రామగుండంలో ప్రజాపాలన పేరుతో పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తూ, ప్రశ్నించే వారిపై లాఠీలతో దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీశ్ రెడ్డి మండిపడ్డారు. గోదావరిఖనిలో న్యాయవాదుల నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. న్యాయవాది తిలక్‌పై అనుచితంగా ప్రవర్తించిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
NZB: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా డిమాండ్ చేశారు. శనివారం ఆదిలాబాద్‌లో నిర్వహించిన ‘రైతు పోరు’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ కాని వారికి పూర్తి స్థాయిలో రూ.2 లక్షల రైతు రుణమాఫీని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్, మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
SRD: సిర్గాపూర్ పీఎం శ్రీ హైస్కూల్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్స్ స్కాలర్షిప్ (NMMS)కు 17 మంది విద్యార్థులు ఎంపికైనట్లు MEO నాగారం శ్రీనివాస్ తెలిపారు. స్థానికంగా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు గత నవంబర్‌లో జరిగిన పాత్ పరీక్షల్లో వీరు ఎంపికయ్యారని చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి వీరికి స్కాలర్షిప్ ప్రారంభమవుతుందన్నారు.
NRPT: ఈవీఎంలు భద్రపరిచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని అడిషనల్ కలెక్టర్ ఫణిందర్ రెడ్డి తెలిపారు. శనివారం నారాయణపేటలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదాములోని ఈవీఎంలను త్రైమాసిక తనిఖీలలో భాగంగా అదనపు కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
MBNR: అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్‌లో మైనార్టీ నేత ఉమెన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి జీవించాలని కోరారు.