SDPT: హుస్నాబాద్ పట్టణంలోని ఎంఈవో కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి మనీలా హాజరై మహిళ ఉపాధ్యాయులని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మహిళామణుల గురించి గొప్ప పాటలను పాడారు.
GDWL: బీజేపీ పార్టీ సిద్ధాంతాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు స్నిగ్ధా రెడ్డి పేర్కొన్నారు. శనివారం గద్వాల మండలంలోని జమ్మిచేడు సమీపంలో నిర్వహించిన రెండు రోజుల పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పార్టీ క్రమశిక్షణ, వ్యవస్థాపక విలువలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
SRPT: రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా రక్షణ, రోడ్డు భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పిస్తామని ఎస్పీ నరసింహ తెలిపారు. శనివారం అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పోలీస్ కార్యాలయాల పరిసరాలను శుభ్రం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యపరుస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
NLG: దేవరకొండ కోర్టులో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి కె. అనిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.స్నేహ ముఖ్య అతిథులుగా పాల్గొని మహిళల హక్కులు మరియు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
KMM: జిల్లా కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడిగా ప్రముఖ వైద్యుడు కాపా మురళీకృష్ణ నియమితులయ్యారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర డాక్టర్స్ సెల్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటికి కృతజ్ఞతలు తెలిపారు.
MHBD: జిల్లా కేంద్రంలోని అక్షర కాన్సెప్ట్ స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా షీ టీం ఎస్సై సునంద హాజరై మాట్లాడారు. అమ్మాయిలకు సమస్యలు ఎదురైతే అమ్మానాన్నలు, టీచర్లకు చెప్పి, ఆ తర్వాత షీ టీం నెంబర్‌ను (8712656935) సంప్రదించాలని సూచించారు. షీ టీం ఫిర్యాదులు గోప్యంగా ఉంటాయని తెలిపారు.
SRD: వాల్టా, మోటార్ వాహనాల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. ఇవాళ సంగారెడ్డి కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, భూగర్భజల శాఖ అధికారులతో అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణా నివారణపై చర్చించారు. జిల్లాలో వాల్టా చట్టం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, భూభారతి దరఖాస్తుల పరిష్కారంపై వీసీ ద్వారా సమీక్షించారు.
MDK: జిల్లా కేంద్రంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఆధ్వర్యంలో శనివారం సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాభివృద్ధి దిశగా సర్పంచ్‌ల పాత్రపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు. పంచాయతీ పాలనలో పారదర్శకత, సమర్థత అవసరాన్ని అధికారులు వివరించారు. అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచనలు అందించారు.
SRCL: జిల్లా పరిధిలోని పెద్దూర్ అపారెల్ పార్కును శనివారం హైకోర్టు న్యాయమూర్తుల బృందం సందర్శించింది. జస్టీస్ తుకారాం జీ, జస్టీస్ లక్ష్మణ్, జస్టిస్ వేణుగోపాల్, జస్టిస్ కార్తీక్, జస్టిస్ శ్రీనివాస రావు, జస్టీస్ నర్సింగరావులతో కూడిన బృందం పార్కులో ఏర్పాటు చేసిన ఆధునిక యంత్రాల పనితీరును పరిశీలించారు.
HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్‌లో ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దావత్ -ఈ -ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మాజీ మంత్రి KTR ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన మత పెద్దలతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి మహ్మద్ అలీకి ఖర్జూర తినిపించి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.
MLG: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల అమలుపై మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగును ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఇసుక అక్రమాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్న ప్రయత్నాలతో పెద్ద విజయాలు సాధించాలన్నారు.
KMR: విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన టీచర్లు బాహాబాహీకి దిగిన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో శనివారం చోటు చేసుకుంది. బొమ్మన్ దేవ్పల్లి ZPHSలో విధులు నిర్వహిస్తున్న నంద్యాల శ్రీనివాస్ తోటి ఉపాధ్యాయుడైన రామోజీ శ్రీనివాస్‌తో వ్యక్తిగత కక్షల కారణంగా ఘర్షణకు దిగారు. ఈ మేరకు నంద్యాల శ్రీనివాస్ కుర్చీతో రామోజీ శ్రీనివాస్ తలపై కొట్టాడు.
NZB: భారతీయ సంస్కృతికి, భారతీయ కుటుంబ వ్యవస్థకుఆధారం ఇంటి ఇల్లాలు అని, అందుకే మన సంస్కృతిలో మాతృదేవోభవ అని మొట్టమొదటి గౌరవాన్ని స్త్రీకే ఇచ్చారని నగర మేయర్ ఉమారాణి వ్యాఖ్యానించారు. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా కౌన్సిలర్ మాదాసు నాగమ్మ యాదవ్ జ్ఞాపకార్థం ఆవిడ మేనల్లుడు మాదాసు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదర్శ మహిళల సన్మాన కార్యక్రమంలో మేయర్ మాట్లాడారు.
HNK: ఐనవోలు మండల కేంద్రంలోని గురుమిళ్ళపల్లి గ్రామానికి చెందిన బేతి మల్లేశం-అరుణ దంపతుల కుమారుడు బేతి విక్రమ్ యూపీఎస్సీ ఫలితాల్లో 472వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు కలిసి విక్రమ్‌ను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. గ్రామానికి గౌరవం తీసుకువచ్చిన విక్రమ్ మరింత ఉన్నత స్థానాలను చేరుకోవాలని కోరారు.
KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో ప్రజా పాలన కార్యక్రమం విజయవంతంగా జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ కే. రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా శాఖ కమీషనర్ ఉత్తర్వుల మేరకు రెండవ రోజు ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా నాక్ & అకడమిక్ రికార్డులను సీనియర్ అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశీలించి, తగు సూచనలు చేశామని పేర్కొన్నారు.