GDWL: ఇటిక్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా ఎంసీహెచ్ అధికారిని డాక్టర్ ప్రసూన రాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. PHC రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదికలను తక్షణమే ఆన్లైన్ ద్వారా జిల్లాకు పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాధిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
BDK: జిల్లా కలెక్టర్ అంకిత్ సింగరేణి ప్రధాన కార్యాలయంలో SCCL CMD డా. జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్‌ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, పరస్పర సహకారంపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ పాల్గొన్నారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం సాయంత్రం ఏర్పాట్లను విగ్రహ కమిటీ నాయకులు పరిశీలించారు. మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్‌తో పాటు కన్వీనర్ లక్ష్మణ శర్మ, సదానందం గౌడు, జంగయ్య, జూపల్లి రాములు, శేఖర్, వీరస్వామి, జగన్ తదితరులు ఏర్పాట్లు సమీక్షించారు.
KMR: భిక్కనూర్ మండలం కాచాపూర్‌లో శనివారం విద్యుత్ షాట్ సర్క్యూట్‌తో ఇళ్లు కాలిపోయింది. గ్రామానికి చెందిన వడ్ల శేఖర్ తన ఇంట్లో వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇంట్లో విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు.
WNP: వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు పెద్దగూడెం ఉపసర్పంచ్ భారతయ్యకు రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి చేతుల మీదుగా దివ్యాంగుల వాహనం అందజేశారు. తాను దివ్యాంగుల వాహనం ఇప్పించాలని విన్నవించగా సంబంధిత అధికారి దివ్యాంగుల వెల్ఫేర్ ద్వారా వాహనం మంజూరు చేయించి అందించారు. నందిమల్ల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
MDK: దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి యువతలోనే ఉందని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026 కార్యక్రమంలో “50 Years of Emergency- Lessons for Indian Democracy” అంశంపై జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు ఎస్పీ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ADB: కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై భారం మోపే విధంగా సిలిండర్ ధరలను పెంచిందని, వెంటనే తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొట్నాక్ దేవిదాస్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. వెంటనే సిలిండర్లను తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
NZB: ఆస్తి పన్నును సకాలంలో వసూలు చేయాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో ప్రాపర్టీ టాక్స్ కలెక్షన్‌పై కమిషనర్ సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా వసూళ్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా విధులు కేటాయించిన ఇతర శాఖల మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
SDPT: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై గజ్వేల్ తహశీల్దార్ కమటం శ్రవణ్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కరీంనగర్‌లోని నివాసంతో పాటు మరో రెండు చోట్ల జరిపిన సోదాల్లో రూ.4 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగుచూశాయి. వీటిలో 2 ఇళ్లు, ఒక అపార్ట్‌మెంట్ (6 ఫ్లాట్లు), మరో 4 ప్లాట్లు, రూ.11.90 లక్షల నగదు, కిలోల కొద్దీ బంగారం ఉన్నాయి.
NLG: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి డిమాండ్ చేశారు. నల్గొండ, పద్మనగర్‌లో మహిళలు కట్టెల పొయ్యి వెలిగించి నిరసన తెలిపారు. నిత్యవసరాల ధరలతో సతమతమవుతున్న పేదలపై గ్యాస్ భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
KNR: ఆకునూరు పురుషుల పొదుపు సంఘం సభ్యుడు గొల్లపల్లి సతీశ్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో ఆయన నామినీ, భార్య సుమలతకు శనివారం రూ. 84,553 క్లెయిమ్ మొత్తాన్ని సంఘం ప్రతినిధులు అందజేశారు. సామూహిక నిధి, అభయనిధి, పొదుపు, బోనస్ నిధులను కలిపి ఈ సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సమితి సంఘం అధ్యక్షుడు రవీందర్ గౌడ్, సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి పాల్గొన్నారు.
MBNR: రాజకీయ రంగంలో బీసీలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శనివారం హైదరాబాదులో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి సంజీవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా దేశాభివృద్ధికి కృషి చేద్దామన్నారు.
SRD: సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ పాండును కలిశారు. ఈమేరకు తమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందడం లేదని చెప్పారు. అంతేకాకుండా పలు గ్రామాల్లో మంచినీటి సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకోవాలని కోరారు.
NRPT: ఊట్కూర్ మండలంలోని ఇడ్లూరు గ్రామంలో ఉన్న శ్రీ లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన శిలాశాసనం దర్శనమిస్తోంది. ఈ శాసనంపై సూర్యుడు, చంద్రుడు, నంది, శివలింగం చెక్కబడి ఉండగా పాత కన్నడ లిపి స్పష్టంగా కనిపిస్తోంది. శతాబ్దాల క్రితం చెక్కబడిన ఈ శాసనంలో దేవాలయ నిర్మాణం, విరాళాలు, భూమి మరియు ధనం దానాల వివరాలు నమోదు చేసి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఖేల్ ఇండియా వాలీబాల్ పోటీలు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్నాయి. వాలీబాల్ పోటీల్లో చల్లూరు గ్రామానికి చెందిన నేతాజీ యూత్ క్లబ్ వాలీబాల్ టీమ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. వేములవాడ టీమ్‌పై నేతాజీ యూత్ క్లబ్ వాలీబాల్ టీమ్ ఘన విజయం సాధించింది. ఈ టీమ్ సభ్యుల ప్రతిభను గ్రామస్థులు, క్రీడాభిమానులు అభినందించారు.