• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

దేవరకొండ కోర్టులో ముస్లిం సిబ్బందికి ఇఫ్తార్

NLG: రంజాన్ మాసం సందర్భంగా దేవరకొండ కోర్టులో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ కె.అనిత, అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.స్నేహ పాల్గొని సిబ్బందితో కలిసి ఇఫ్తార్‌ను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరం, గాజుల ఆంజనేయులు, ఇతర కోర్టు సిబ్బంది ఉన్నారు.

March 7, 2026 / 07:35 PM IST

నిర్మాణ పనులను పరిశీలించిన ఛైర్మన్

JN: రఘునాథపల్లి మండలంలోని వెంకటాయపాలెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లను గ్రంథాలయ ఛైర్మన్ రాంబాబు, నేతలు పరిశీలించారు. వెంకటాయపాలెం గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కోరుతామని ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

March 7, 2026 / 07:34 PM IST

‘మహిళా రక్షణలో బీజేపీ ప్రభుత్వం విఫలం’

SRPT: బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, వారికి సరైన రక్షణ కరువైందని NFIW రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన ఆరోపించారు. సూర్యాపేటలో ఆమె మాట్లాడుతూ.. చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అమలులో జాప్యం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. షీ టీమ్స్ సంఖ్యను పెంచాలని హైదరాబాద్‌లో జరిగే మహిళా దినోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు.

March 7, 2026 / 07:33 PM IST

ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

HYD: బౌద్ధనగర్‌లో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు పరమత సహనానికి, సోదరభావానికి ప్రతీకలని కొనియాడారు. రంజాన్ పండుగను అందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

March 7, 2026 / 07:32 PM IST

మహిళా సాధికారత మాటలకేపరిమితం: ఐద్వా

BHNG: అన్ని రంగాల్లో మహిళలను విస్మరిస్తున్నారని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాంకేతికత పెరుగుతున్నా మహిళలను రెండో తరగతి పౌరులుగానే చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు మహిళా సాధికారత అని ప్రగల్భాలు పలికే పార్టీలు, అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాయన్నారు.

March 7, 2026 / 07:30 PM IST

తంగళ్లపల్లిలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

SRCL: ఎమ్మెల్యే కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా తంగళ్లపల్లి జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులకు టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలు సాధించాలని జగన్, కొడి అంతయ్య సూచించారు. విద్యార్థుల కోసం కేటీఆర్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని తెలిపారు.

March 7, 2026 / 07:28 PM IST

చెరువులో పడి బాలుడు మృతి

MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ చెరువులో పడి జార్ఖండ్ రాష్ట్రం సిద్ధిలీకి చెందిన సన్నీ కుమార్ (11) మృతి చెందినట్లు ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. శనివారం సాయంత్రం కాలకృత్యాలకు వెళ్లి చెరువు వైపు వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడ్డాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించినట్లు వివరించారు.

March 7, 2026 / 07:28 PM IST

‘ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించడమే లక్ష్యం’

KMM: కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీటి నల్లా కనెక్షన్ అందించడమే తమ లక్ష్యమని కౌన్సిలర్ పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా వార్డు ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు 1వ వార్డు కౌన్సిలర్ మోరు శ్రీకాంత్ తెలిపారు. శనివారం ఆయన వాటర్ గ్రిడ్ AE, DEలతో కలిసి వార్డు పరిధిలో పర్యటించారు.

March 7, 2026 / 07:25 PM IST

పదవ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు వితరణ

BDK: అశ్వాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు సహాయంగా పూర్వ విద్యార్థులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. 1992-93 విద్యా సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థి కటకం సత్యనారాయణ తన తండ్రి కటకం కృష్ణ జ్ఞాపకార్థంగా ఇవాళ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్లు, స్కేల్లు, పెన్నులను పంపిణీ చేశారు.

March 7, 2026 / 07:19 PM IST

జిల్లాలో త్వరలో భారీగా ఎస్సైల బదిలీలు..?

BHPL: జిల్లా పోలీస్ శాఖలో త్వరలో భారీగా ఎస్సైల బదిలీలు జరగనున్నట్లు సమాచారం. SP సంకీర్త్ గౌడ్ బాధ్యతలు చేపట్టి అనంతరం ఇప్పటివరకు SIల బదిలీలు జరగలేదు. జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్లలో ప్రస్తుతం 26 మంది SIలు విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

March 7, 2026 / 07:19 PM IST

కలెక్టర్‌ను కలిసిన డీసీసీ మహిళా అధ్యక్షురాలు

MHBD: కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ స్నేహ శబరిష్‌ను డీసీసీ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె కలెక్టర్‌కు పూల మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలోని పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై కలెక్టర్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు.

March 7, 2026 / 07:19 PM IST

ప్రాథమిక పాఠశాలలో తనిఖీ నిర్వహించిన కలెక్టర్

KMM: కొణిజర్ల మండలం పల్లిపాడు బస్ స్టేజి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించే ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం అమలును ఇవాళ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాష పరిజ్ఞానం మెరుగుపరిచి, రీడింగ్ స్కిల్స్ పెంపొందించాలని సూచించారు. ఉపాధ్యాయులు అందుకు అనుగుణంగా కృషి చేసి చేయాలని పేర్కొన్నారు.

March 7, 2026 / 07:17 PM IST

విశ్వకర్మ పథకంపై అవగాహన

NRML: పట్టణంలోని హోటల్ మారుతి ఇన్‌లో శనివారం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు పథకం వివరాలు తెలియజేసి ప్రభుత్వ రుణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 7, 2026 / 07:14 PM IST

మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

MLG: మహిళల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి మహిళ మహిళా సంఘాల్లో చేరాలని రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్స్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. రెండున్నర ఏళ్లలో 36 వేల కోట్ల రుణాలు, 11 వేల 21 కోట్ల వడ్డీ మాఫీ అందించామని మంత్రి పేర్కొన్నారు.

March 7, 2026 / 07:12 PM IST

ఘనంగా శనేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

ఆసిఫాబాద్ పట్టణంలో శనేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం శనివారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్యామ్ నాయక్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా సమాజంలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయన్నారు.

March 7, 2026 / 07:06 PM IST