SRCL: ఎమ్మెల్యే కేటీఆర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా తంగళ్లపల్లి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండి జగన్ ఆధ్వర్యంలో ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలు సాధించాలని జగన్, కొడి అంతయ్య సూచించారు. విద్యార్థుల కోసం కేటీఆర్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారని తెలిపారు.