WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో తేజ మిర్చి ధర క్రమంగా పెరుగుతోంది. గత నెలలో రూ. 19వేలు ధర మాత్రమే పలికిన తేజ మిర్చి క్రమంగా పెరుగుతూ వస్తూ గతవారం రూ. 21 వేల రికార్డు ధరకు చేరింది. సోమవారం క్వింటా మిర్చి ధర రూ. 21,100 పలకగా, మంగళవారం మరింత పెరిగి రూ. 21,600 అయింది. గురువారం కాస్త తగ్గి రూ. 21 వేలకి చేరింది.