• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని వినత

HNK: మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డీఆర్ఓకు సీఐటీయూ నేతలు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని కోరారు. 2వ పీఆర్సీలో నిర్ణయించి అమలు చేయాలని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్ చేశారు.

March 7, 2026 / 06:40 PM IST

దిలావర్పూర్‌లో పర్యటించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్

NRML: దిలావర్‌పూర్ మండల కేంద్రంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డీ. శంకర్ ఇవాళ ఆకస్మికంగా పర్యటించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, పీహెచ్‌సీ, జడ్పీహెచ్‌ఎస్ ఎంపీపీఎస్ పాఠశాలలను పరిశీలించారు. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.

March 7, 2026 / 06:36 PM IST

కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సంక్షేమం: ఎమ్మెల్యే

MBNR: కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు తండాలో ఇండిపెండెంట్ సర్పంచ్ పద్మావత్ లక్ష్మీనారాయణ నాయక్, ఉప సర్పంచ్ కిషన్ నాయక్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి సాదరంగా కండువాలు కప్పి ఆహ్వానించారు.

March 7, 2026 / 06:36 PM IST

టీఎన్జీవోస్ భవన్‌లో ఘనంగా మహిళా దినోత్సవం

KNR: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను టీఎన్జీవోస్ భవన్లో శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం మహిళా ఉద్యోగులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. మహిళలు ప్రతి రంగంలో ముందంజలో ఉన్నారని టీఎన్జీవోస్ అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

March 7, 2026 / 06:35 PM IST

దేశంలోనే తొలి ‘మాడ్యులర్ రెటీనా ఓటీ’ ప్రారంభం

KNR: రేకుర్తి నేత్ర వైద్య శాలలో అత్యాధునిక ‘మాడ్యులర్ రెటీనా ఓటీ’ని మార్గదర్శి ఎండీ శైలజ కిరణ్ ప్రారంభించారు. ఈ అత్యాధునిక యంత్రాన్ని దేశంలోనే తొలిసారిగా ఇక్కడ కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు. కేవలం రూ. 50 రిజిస్ట్రేషన్‌తో నాణ్యమైన సేవలు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి పారిశుద్ధ్యాన్ని మెచ్చుకున్నారు.

March 7, 2026 / 06:35 PM IST

హామీని నిలబెట్టుకున్న మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్

NLG: చిట్యాల మున్సిపాలిటీ వైస్ ఛైర్ పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు (5వ వార్డు) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. తన వార్డులోని పేద ఇంటి ఆడబిడ్డల వివాహానికి రూ.15,116లు ఆర్థిక సాయం అందిస్తానన్న వాగ్దానంలో భాగంగా, జక్కల నందిని వివాహానికి ఆమె శనివారం హాజరై వివాహ కానుకను అందించారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించారు.

March 7, 2026 / 06:34 PM IST

ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

మంచిర్యాలలోని కాలేజ్ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

March 7, 2026 / 06:34 PM IST

మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్

HYD: ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ బండారి శైలజా ఆగిరెడ్డి గారు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. 

March 7, 2026 / 06:33 PM IST

మహిళా శక్తి ఎంతో గొప్పది: కలెక్టర్

BDK: జిల్లా కలెక్టరేట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు కలెక్టర్ అంకిత్, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ M.గణేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోని మహిళలు ఎంతో మంచి విజయాలు సాధించారని, మహిళా శక్తి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొన్నారు.

March 7, 2026 / 06:31 PM IST

నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరిన ఎమ్మెల్యే

MHBD: రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వంటి కార్యక్రమాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వినతి పత్రాన్ని సమర్పించారు.

March 7, 2026 / 06:30 PM IST

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం

MBNR: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలను ఒక దారిన నడిపిస్తూ.. తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని వెల్లడించారు.

March 7, 2026 / 06:30 PM IST

‘వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు’

SRD: వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు అన్నారు. సంగారెడ్డిలోని ప్రనామ్ కేర్ సెంటర్‌లో వృద్ధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వృద్ధులకు బీపీ, షుగర్ తదితర టెస్టులు ఉచితంగా చేస్తామని చెప్పారు. ఈ సెంటర్‌లో వృద్ధులు తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలని పేర్కొన్నారు.

March 7, 2026 / 06:30 PM IST

అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

SRD: జిల్లాలో కంకర, ఇసుక అక్రమ రవాణా జరగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వాల్టా చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మోటారు వాహన యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని చెప్పారు.

March 7, 2026 / 06:30 PM IST

శృంగేరి పీఠాధిపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే

GDWL: అలంపూర్ ఆలయాల సందర్శనకు వచ్చిన శృంగేరి శారదా పీఠం పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతి స్వామిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఎమ్మెల్యే పీఠాధిపతిని కలిసి ఆలయ అభివృద్ధిపై చర్చించారు.

March 7, 2026 / 06:28 PM IST

‘గీత కార్మికులను అన్ని విధాలఆదుకోవాలి’

BHNG: చేతివృత్తులన్నింటిలో అత్యంత ప్రమాదకరమైనది కల్లుగీత వృత్తి అని, దీనిపై ఆధారపడిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని KGKS రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయరాములు గౌడ్ డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గీత కార్మికుల సంక్షేమం కోసం రూ. 5,000 కోట్లు కేటాయించాలని కోరారు. ఈ మేరకు కాటమయ్య కిట్లు అందజేయాలని కోరారు.

March 7, 2026 / 06:26 PM IST