SRD: వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు అన్నారు. సంగారెడ్డిలోని ప్రనామ్ కేర్ సెంటర్లో వృద్ధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వృద్ధులకు బీపీ, షుగర్ తదితర టెస్టులు ఉచితంగా చేస్తామని చెప్పారు. ఈ సెంటర్లో వృద్ధులు తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలని పేర్కొన్నారు.