• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బస్టాండ్‌లో శుభ్రత కార్యక్రమం

SRCL: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇల్లంతకుంటలోని బస్టాండ్ ఆవరణలో శనివారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎం.రాజు, ఎంపీడీవో శశికళ ఆధ్వర్యంలో రోడ్డును శుభ్రం చేసి బస్టాండ్ ప్రాంగణాన్ని నీటితో శుభ్రం చేశారు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 7, 2026 / 02:45 PM IST

రామగుండంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్

PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ విస్తృతంగా పర్యటించారు. 49వ డివిజన్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఎన్‌టీపీసీ, రామగుండం జడ్పీహెచ్ పాఠశాలల, పశు వైద్యశాల, సబ్ రిజిస్టార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రామగుండంలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని మే నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

March 7, 2026 / 02:44 PM IST

రామయ్యను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి సురేపల్లి నందా శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.

March 7, 2026 / 02:43 PM IST

రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని కలిసిన జిల్లా నేత

NLG: రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డిని ఇవాళ వారి నివాసంలో నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు తోర్పునూరి శ్రీకాంత్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో యువతకు 20 శాతం అవకాశాలు కల్పించేందుకు కృషి చేసిన శివ చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. వీరితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 7, 2026 / 02:40 PM IST

అశ్వరావుపేటలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట మండలంలో శనివారం మాజీ ఎమ్మెల్యే మచ్చా వెంకటేశ్వరరావు పర్యటించారు. గుమ్మడివల్లిలో నాజర్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్ళారు. గ్రామ BRS నాయకులందరితో కలిసి ఆత్మీయంగా మాట్లాడుతూ సమయం గడిపారు. స్థానిక రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకుని భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలో పలు సూచనలు చేశారు.

March 7, 2026 / 02:39 PM IST

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని వినతి

NRML: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు గుడిసె సంపూర్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా మార్చ్ 15 నుంచి అంగన్వాడీలకు ఒంటిపూట బడులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

March 7, 2026 / 02:38 PM IST

ఉత్తమ మహిళా ఉద్యోగిగా ఎంపిక

MDK: రామాయంపేట రేంజ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అటవీ శాఖలో ఆమె అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర స్థాయి ‘ఉత్తమ మహిళా ఉద్యోగి’ అవార్డుకు ఎంపికయ్యారు. దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అదనపు డీజీపీ స్వాతి లక్రా, అటవీ శాఖ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆమె అవార్డును స్వీకరించారు.

March 7, 2026 / 02:35 PM IST

ఉత్సాహంగా ‘స్వపరిపాలన దినోత్సవం’

BHNG: CPL మండలం పంతంగి జి.ప.ఉన్నత పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. టెన్త్ విద్యార్థిని దీక్షసేథ్ హెచ్ఎంగా, రామ్ చరణ్ సీఎంగా, నూరిన్ కలెక్టర్‌గా, దీపికప్రియ డీఈవోగా, ప్రణవి Dy డీఈవోగా, అభినవ్ ఎంఈఓగా, కావేరి ఎంపీటీసీగా, ఈశ్వర్ సర్పంచ్‌గా, ప్రవళిక పాఠశాల ఛైర్మన్‌గా విధులు నిర్వహించారు. ఈ మేరకు హెచ్ఎం సత్యనారాయణ అభినందించారు.

March 7, 2026 / 02:32 PM IST

ఎడపల్లి PHCని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NZB: ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుతో పాటు రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మందుల నిల్వలు, ఆసుపత్రిలోని సదుపాయాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. రోగులకు ఎల్లప్పుడూ మెరుగైన వైద్యం అందించాలని MLA సూచించారు.

March 7, 2026 / 02:31 PM IST

సీఎం మాట నిలబెట్టుకున్నారు: షబ్బీర్ అలీ

KMR: సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో శనివారం భిక్కనూర్ లక్ష్మీ, చిట్యాల రాజమణిలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

March 7, 2026 / 02:31 PM IST

రైతులకు సాగునీరు అందించాలి: ఎమ్మెల్యే

HNK: దేవాదుల కింద దాదాపు 3 లక్షల ఎకరాలలో పంట సాగు అవుతుందని ఒక్క ఎకరం కూడా నీరు అందక ఎండిపోవడానికి వీలు లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ దిశ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. రానున్న ఈ నెల రోజులపాటు పంట పొలాలకు సాగునీరు అత్యంత కీలకమైన సమయమని, రైతులకు సాగునీరు అందించాలన్నారు.

March 7, 2026 / 02:30 PM IST

పట్టణంలో భారీ అగ్నిప్రమాదం

SDPT: సిద్దిపేట పట్టణంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని మెరీడియన్ హైస్కూల్ సమీపంలోని ఓ డెకరేషన్ గోదాంలో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో నిర్వాహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 7, 2026 / 02:27 PM IST

‘పాంబండ ఉత్సవాలను విజయవంతం చేద్దాం’

VKB: కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామ పరిధిలోని పాంబండ ఉత్సవాలను విజయవంతం చేద్దామని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆంజనేయులు అన్నారు. ఆలయ అభ్యున్నతికి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నాయకత్వంలో కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆలయ నూతనంగా ఉత్సవ కమిటీ ఛైర్మన్‌గా మైపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

March 7, 2026 / 02:26 PM IST

ఘనంగా ‘జన ఔషధి దివస్’ కార్యక్రమం

RR: ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన జన ఔషధి కేంద్రాలు విజయవంతంగా ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని ఓ పాఠశాలలో ‘జన ఔషధి దివస్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి మాట్లాడుతూ.. సామాన్యులకు తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రాలను నడుపుతోందన్నారు.

March 7, 2026 / 02:22 PM IST

ఆయుర్వేద ఆసుపత్రిలో ప్రజా పాలన

MDK: తూప్రాన్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఇవాళ ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు. సీనియర్ వైద్యాధికారి డాక్టర్ రాణి శర్మ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి ఆస్పత్రి పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ బ్లెస్సీ, జూనియర్ అసిస్టెంట్ సురేష్, ఫార్మసిస్ట్ వెంకటేశ్వర్ గౌడ్, సౌజన్య, వెంకటరమణ, కవిత పాల్గొన్నారు.

March 7, 2026 / 02:18 PM IST