• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: రంజాన్ మాసం సందర్భంగా వేములవాడ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.

March 6, 2026 / 09:14 PM IST

‘అక్రమ మద్యం షాపులను వెంటనే తొలగించాలి’

ADB: ఇచ్చోడ మండల వ్యాప్తంగా అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని ఏజెన్సీ పరిరక్షణ కమిటీ మండల అధ్యక్షుడు ఆత్రం మహేందర్ డిమాండ్ చేశారు. పల్లెల్లో మండల కేంద్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాల వల్ల మహిళలు, యువత తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైంజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

March 6, 2026 / 09:06 PM IST

‘ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలి’

ASF: రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రేను ఆసిఫాబాద్ మాజీ MLA ఆత్రం సక్కు శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పబ్లిక్ స్కూల్స్ కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు. దీనిపై ప్రత్యేక కార్యదర్శి సానుకూలంగా స్పందించి జిల్లా విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

March 6, 2026 / 09:04 PM IST

నిర్మల్ జిల్లాలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత

NRML: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలో నమోదు కావాల్సిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదు అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లాలో శుక్రవారం 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత భైంసా మండలంలో నమోదు కాగా, తానూర్లో 37 డిగ్రీలు, అత్యల్పంగా కుంటాలలో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

March 6, 2026 / 09:02 PM IST

బేతి విక్రమ్ సివిల్ సర్వీసెస్‌లో 472 ర్యాంక్

HNK: ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి విక్రమ్ నేడు వెలబడిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 472వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. ప్రస్తుతం ఆయన సిరిసిల్ల జిల్లా, మార్కుర్ మండల ప్రజా పరిషత్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు మల్లేశం అరుణ వ్యవసాయం కుటుంబం. గ్రామస్థులు మరియు కుటుంబ సభ్యులు అతని విజయంపై గర్వంగా ఉన్నారు.

March 6, 2026 / 09:00 PM IST

రేపు విద్యుత్ సరఫరాలు అంతరాయం

BDK: ఈ బయ్యారం ఫీడర్ లో లైన్ మైంటెనెన్స్, చెట్ల కొమ్మలు తొలగించుటకు AK మల్లారం నుంచి ఆల్టర్నేట్ సప్లై తీసుకోవడం జరుగుతుంది. కనుక ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు పినపాక మండలంలోని అన్ని ప్రాంతాలలో సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే ఉంటుంది. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ ఇవ్వాళ ఓ ప్రకటనలో తెలిపారు.

March 6, 2026 / 09:00 PM IST

మూగ క్రికెటర్‌కు అండగా నిలిచిన సర్పంచ్

BHPL: రేగొండ(M) రంగయ్యపల్లి సర్పంచ్ మోహన్ రావు తన ఉదారతతో మూగ క్రికెటర్ పసుల రాజుకు అండగా నిలిచారు. వైకల్యాన్ని అధిగమించి క్రికెట్‌లో అద్భుత ప్రతిభ చూపుతున్న పసుల రాజు ఇటీవల జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయనకు కిట్ కొనుగోలు, ప్రయాణ ఖర్చులకు ఇబ్బంది ఎదురవుతున్న విషయం తెలిసి సర్పంచ్ రూ.4,000 ఆర్థిక సాయం అందజేశారు.

March 6, 2026 / 09:00 PM IST

‘కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ రావులపై ఆరోపణలు సరికాదు’

MHBD: కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషోర్ రెడ్డి, హరిప్రసాద్ రావులపై ఆరోపణలు సరికాదని తొర్రూరు మండలంలోని మడిపల్లి, సోమారం సర్పంచులు రామలింగం, లింగమూర్తిలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కౌన్సిలర్ గా గెలవలేని వ్యక్తులు మా నాయకుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సోమేశ్వరరావు లాంటి వ్యక్తుల వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తు చేశారు.

March 6, 2026 / 09:00 PM IST

మాసబ్‌ట్యాంక్ కార్యాలయాన్ని పరిశీలించిన కమిషనర్

HYD: మాసబ్‌ట్యాంక్‌లోని సమాచార & ప్రజాసంబంధాల శాఖ కార్యాలయంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక కార్యాలయాన్ని పరిశీలించి ప్రతి విభాగం పనితీరును సమీక్షించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.పెండింగ్ ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలని, ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలన్నారు.

March 6, 2026 / 08:59 PM IST

‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యాచరణను విజయవంతం చేయాలి’

KMR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు. అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.

March 6, 2026 / 08:57 PM IST

అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలి: CP

NZB: అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి నిజామాబాద్ నగరానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి 2వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమా మసీద్‌లో మజీద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో CP పాల్గొని మాట్లాడారు. రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు.

March 6, 2026 / 08:52 PM IST

ఆకతాయిల ఆటకట్టించిన ‘షీ టీమ్’!

NRPT: పట్టణ బస్టాండ్ ఆవరణలో మహిళలను వేధిస్తున్న ఇద్దరు ఆకతాయిలను జిల్లా షీ టీమ్ సభ్యులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మఫ్టీ దుస్తుల్లో నిఘా పెట్టి నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రజిత హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం 8712657676, 100కు కాల్ చేయాలని సూచించారు.

March 6, 2026 / 08:50 PM IST

విషాదం.. మహిళ ఆత్మహత్య

KNR: శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైస్మిల్లు యజమాని తణుకు స్వప్న తన నివాసంలోని స్నానాల గదిలో చున్నీతో ఉరేసుకుంది. తెల్లవారుజామున స్నానానికి వెళ్లిన ఆమె ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి చూడగా మృతి చెంది ఉండడాన్ని గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

March 6, 2026 / 08:48 PM IST

కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలి: FPO ఛైర్మన్

KMR: ఎర్రకందులైనా.. తెల్ల కందులైనా మద్దతు ధర కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని FPO ఛైర్మన్ గోపాల్ రైతులకు సూచించారు. శుక్రవారం మద్నూర్ మార్కెట్ యార్డును ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. NCCF ద్వారా మద్నూర్ FPO ఆధ్వర్యంలో కొనసాగుతున్న మద్దతు ధర కేంద్రంలో కంది పంటను అమ్ముకుని క్వింటాలుకు రూ.8000 మద్దతు ధర పొందాలని సూచించారు.

March 6, 2026 / 08:48 PM IST

ఆలయ అన్నదాన ట్రస్ట్‌కు రూ. 2 లక్షల విరాళం అందజేత

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్‌కు హైదరాబాద్ వాసులు రూ. 2 లక్షల విరాళం అందజేశారు. హైదరాబాద్ కోకాపేట్‌కు చెందిన బొమ్మ వేణి రాజేశ్వరరెడ్డి–సౌజన్య దంపతులు రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం చేయించి, అర్చకుల చేత ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.

March 6, 2026 / 08:46 PM IST