HYD: మాసబ్‌ట్యాంక్‌లోని సమాచార & ప్రజాసంబంధాల శాఖ కార్యాలయంలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభమైంది. ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక కార్యాలయాన్ని పరిశీలించి ప్రతి విభాగం పనితీరును సమీక్షించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు.పెండింగ్ ఫైళ్లను త్వరగా క్లియర్ చేయాలని, ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలన్నారు.