SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నదాన ట్రస్ట్‌కు హైదరాబాద్ వాసులు రూ. 2 లక్షల విరాళం అందజేశారు. హైదరాబాద్ కోకాపేట్‌కు చెందిన బొమ్మ వేణి రాజేశ్వరరెడ్డి–సౌజన్య దంపతులు రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శనం చేయించి, అర్చకుల చేత ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలను అందజేశారు.