ASF: రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి వెంకటేష్ ధోత్రేను ఆసిఫాబాద్ మాజీ MLA ఆత్రం సక్కు శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పబ్లిక్ స్కూల్స్ కేటాయించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు. దీనిపై ప్రత్యేక కార్యదర్శి సానుకూలంగా స్పందించి జిల్లా విద్యాభివృద్ధికి కృషి చేస్తానన్నారు.